Fatty liver
మన శరీరంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేసే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ ఉంది. అదే కాలేయం (Liver). ఇది మన శరీరంలో దాదాపు 500కు పైగా పనులను చేస్తుంది. మనం తినే ఆహారాన్ని, తాగే పానీయాలను, తీసుకునే మందులను శుభ్రం చేయడంలో దీని పాత్ర చాలా కీలకం.
కాలేయం ప్రధానంగా విష పదార్థాలను బయటకు పంపిస్తుంది, శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేస్తుంది. అలాగే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, రక్తాన్ని గడ్డ కట్టించడంలో సహాయపడుతుంది.
కాలేయాని(Fatty liver)కి హాని కలిగించే కారణాలు ఏంటంటే..కాలేయం ఇంత ముఖ్యమైనది అయినా కూడా, చాలామంది తమ అలవాట్లతో దానికి హాని కలిగిస్తారు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది మొదటి దశలో పెద్దగా లక్షణాలను చూపించదు, కానీ దీర్ఘకాలంలో సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, చిక్కుళ్ళు, మరియు హోల్ గ్రైన్స్ తినడం వల్ల కాలేయం శుభ్రంగా ఉంటుంది.
అలాగే రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది, మరియు కాలేయం దాని శుభ్రపరిచే పనిని సమర్థవంతంగా చేస్తుంది.అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది, కాలేయంపై కొవ్వు(Fatty liver) చేరకుండా ఉంటుంది. వీలైనంత వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం కాలేయ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.