Age: ఈ అలవాట్లు పాటిస్తే మీ ఏజ్ రివర్స్ అవుతుందట

Age: ఒక వయసు వచ్చాక శరీరం డల్‌గా తయారవడం, ముడతలు రావడం, కీళ్ల నొప్పులు రావడం సహజం.

Age

వయస్సు(Age)తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌తో, అందంగా, ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. అయితే ఒక వయసు వచ్చాక శరీరం డల్‌గా తయారవడం, ముడతలు రావడం, కీళ్ల నొప్పులు రావడం సహజం. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం, ఈ ఏజింగ్ (వృద్ధాప్యం) ప్రాసెస్‌ను కూడా కొంతవరకు రివర్స్ చేయవచ్చు లేదా గణనీయంగా స్లో చేయవచ్చు. దీనికి మనం చేయాల్సిందల్లా, మన శరీరంలోని కణాలకు ముందు నుంచే సరైన పోషణ అందించడం. శరీరంలోని ప్రతి కణం జీవంతో ఉప్పొంగుతుంటే, వృద్ధాప్యం అనేది ఆటోమేటిక్‌గా పోస్ట్ పోన్ అవుతుంది.

ఏజింగ్(Age) ప్రాసెస్‌ను స్లో చేసే ముఖ్యమైన అలవాట్లు..

శరీరానికి ఆహారం ద్వారానే కాదు, సూర్య కాంతి ద్వారా కూడా పోషణ అందుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. జీవ కణాలు హెల్దీగా ఉండాలంటే తగినంత సన్ ఎక్స్‌పోజర్ ఉండాలి. సూర్యుడి నుంచి లభించే విటమిన్ డి కూడా ఏజింగ్ ప్రాసెస్‌ను స్లో చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

రోజువారీ ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవడం ద్వారా, ఎటువంటి విటమిన్ లోపాలు రాకుండా కణాలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది ఏజింగ్ ప్రాసెస్‌ను స్లో చేస్తుంది.

Age

ప్రతిరోజూ కనీసం 20 లేదా 30 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా గుండె పనితీరు, రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల షుగర్, బీపీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. వయసు పైబడిన తర్వాత కూడా హెల్దీగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం.

శరీరంలోని కండరాల పోషణకు ప్రొటీన్ చాలా ముఖ్యమైనది. కేలరీలు, షుగర్ కంటెంట్ కంటే ప్రొటీన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతిరోజూ నట్స్ వంటి ఆరోగ్యకరమైన ప్రొటీన్స్‌ను తప్పక తీసుకోవాలి.

ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు, లేదా కనీసం రోజుకి 3 లీటర్ల నీరు అయినా తాగుతుండడం ద్వారా రక్తం, కిడ్నీలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చర్మానికి తేమ అంది, వయసుతోపాటు వచ్చే ముడతలు, ఇతర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

(గమనిక: ఈ అంశాలు నిపుణులు అందించిన సాధారణ సమాచారం మాత్రమే. ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version