Anemia: శరీరంలో రక్తం తక్కువగా ఉందా ? అయితే ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి..

Anemia: మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సాధారణంగా పురుషులకు 13.5 నుంచి 16.5 గ్రాములు, మహిళలకు 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి.

Anemia

ప్రస్తుత కాలంలో రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సాధారణంగా పురుషులకు 13.5 నుంచి 16.5 గ్రాములు, మహిళలకు 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు అయితే 10 నుంచి 15 గ్రాముల మధ్య ఉండటం అవసరం. కానీ ఈ పరిమాణం కంటే తక్కువగా ఉన్నప్పుడు అది తీవ్రమైన రక్తహీనత సమస్యగా మారుతుంది.

రక్తహీనత లక్షణాలు.. రక్తహీనత (Anemia)మనిషిని చాలా బలహీనపరుస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా నీరసం, అలసట, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ,గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒంట్లో రక్తం లెవెల్స్ తగ్గితే అది క్రమంగా ఎనీమియా సమస్యగా మారే అవకాశం ఉంటుంది.

ఆహారంతోనే పరిష్కారం.. చాలామంది రక్తహీనతను తగ్గించుకోవడానికి ఇంగ్లీష్ మందులను, ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి, వాటి బదులు మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. కొన్ని రకాల సహజసిద్ధమైన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Anemia

రక్తాన్ని పెంచే అద్భుతమైన ఆహారాలు..

బీట్‌రూట్ (Beetroot).. శరీరంలో రక్తం పెరగడానికి బీట్‌రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడి, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని గణనీయంగా పెంచుతుంది.

యాపిల్ (Apple).. ‘రోజుకో యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు’ అనే మాట నిజం. ఆరోగ్యంగా ఉంచే యాపిల్‌లో రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

దానిమ్మ (Pomegranate).. రక్తం లాగే ఎర్రగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ , విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మను రోజూ తీసుకుంటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.

డ్రై ఫ్రూట్స్ (Dry Fruits).. రక్తవృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఖర్జూరాలు, బాదం , వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం క్రమంగా పెరుగుతుంది.

పాలకూర (Spinach).. ఆకుకూరల్లో, ముఖ్యంగా పాలకూరలో ఐరన్ శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు తమ ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలి. సరైన డైట్ ఫాలో కావడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version