Organic: ఆర్గానిక్ లైఫ్ స్టైల్..ఎందుకు అందరూ అటువైపే వెళ్తున్నారు?

Organic: మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ధరలు కొంత ఎక్కువగా ఉన్నా.. ఆసుపత్రి ఖర్చుల కంటే ఆర్గానిక్ లైఫ్ స్టైల్ తక్కువని,మంచివని ప్రజలు భావిస్తున్నారు.

Organic

ఒకప్పుడు మన తాతల కాలంలో ప్రతిదీ నేచురల్‌గానే ఉండేది. కానీ మధ్యలో వచ్చిన మోడర్న్ పేరుతో మనం రసాయనాలు, పురుగుమందులతో నిండిన ఆహారానికి అలవాటు పడ్డాం. అయితే, ఐదేళ్లుగా ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత ప్రజల్లో మళ్లీ ఒక భారీ మార్పు కనిపిస్తోంది. అదే ‘ఆర్గానిక్ లైఫ్ స్టైల్(Organic)’ అంటున్నారు పోషకాహార నిపుణులు.

ఇప్పుడు ఇది కేవలం ధనవంతుల ఫ్యాషన్ కాదు, సామాన్యులు కూడా తమ ఆరోగ్యం కోసం ఎంచుకుంటున్న తప్పనిసరి డైట్‌లో ఆర్గానిక్ ఫుడ్ భాగం అయిపోయింది. మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ధరలు కొంత ఎక్కువగా ఉన్నా.. ఆసుపత్రి ఖర్చుల కంటే ఇవే తక్కువని,మంచివని ప్రజలు భావిస్తున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం పెరిగిపోతున్న క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులే అంటున్నారు డాక్టర్లు.

ఆర్గానిక్ జీవనశైలి(Organic) అంటే కేవలం కూరగాయలు ఆర్గానివ్‌వి వాడటం మాత్రమే కాదు. మనం వాడే సబ్బులు, షాంపూలు, బట్టలు, చివరికి మనం పడుకునే పరుపుల వరకు ప్రతిదీ కెమికల్ ఫ్రీగా ఉండాలని ఇప్పటివారు కోరుకుంటున్నారు. ఆర్గానిక్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ (విషతుల్యాలు) బయటకు వెళ్లిపోతాయి.

Organic

రసాయన ఎరువులు లేని మట్టిలో పండే ఆహారంలో.. పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే కొన్నాళ్ల నుంచి చాలామంది తమ ఇంటి డాబాల మీద ‘కిచెన్ గార్డెన్’ ఏర్పాటు చేసుకుని మరీ తమకు కావాల్సిన వస్తువులను తామే పండించుకుంటున్నారు.

అయితే ఈ (Organic)లైఫ్ స్టైల్ వల్ల కేవలం మనకే కాదు, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. భూమి సారం దెబ్బతినకుండా ఉండటంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఆర్గానిక్ లైఫ్ స్టైల్‌ను అలవాటు చేసుకున్న వారు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

నిజానికి మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే, ఆరోగ్యానికి అంత చేరువగా ఉంటాం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే 2026లో ఆర్గానిక్ మార్కెట్ మరింత పుంజుకోబోతోందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు, రాబోయే తరాలకు మనం ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన వారసత్వం అంటున్నారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version