Stress
ఒత్తిడి అనేది మన ఆధునిక జీవితంలో ఒక సాధారణ భాగమైపోయింది. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి మనల్ని నిరంతరం వేధిస్తుంటాయి. కొంత ఒత్తిడి మనల్ని చురుకుగా ఉంచినా, దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
అధిక ఒత్తిడి వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం నేర్చుకోవడం చాలా అవసరం.
ఒత్తిడి(Stress)ని జయించడానికి చిట్కాలు:
- విశ్రాంతి.. పని మధ్యలో విరామం తీసుకోవడం, హాబీలకు సమయం కేటాయించడం వల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది.
- వ్యాయామం.. రోజూ కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గి, మంచి ఫీలింగ్ కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి.
- ధ్యానం.. ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.
- సమయ నిర్వహణ..పనులన్నీ ఒకేసారి కాకుండా, ముఖ్యమైన వాటిని ముందుగా పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
- సామాజిక సంబంధాలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల మనసులోని భారం తగ్గుతుంది. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపాలి.
ఒత్తిడి ఒక అనివార్యమైన భాగం. దానిని పూర్తిగా తొలగించలేకపోవచ్చు, కానీ దానిని సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం.