Cold Wave: ఒక్కసారిగా పెరిగిన చలి..వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

Cold Wave: చలి తీవ్రత వల్ల చాలామంది జలుబు, దగ్గు , జ్వరాల బారిన పడుతున్నారు.

Cold Wave

మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత (Cold Wave) ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత చలి పెరగడంతో..ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

సాయంత్రం మొదలైన చలి మరుసటి రోజు ఉదయం కాగానే తగ్గిపోతుంది. కానీ మధ్యాహ్నం వరకు కూడా పంజా విసురుతోంది. పని ఉన్నా కూడా ఉదయం పూట ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి కాస్త వెచ్చదనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

చలి తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు (Health Issues) తలెత్తకుండా ప్రజలు ముఫ్లర్ కట్టుకోవడం, మంకీ క్యాప్ తలకు పెట్టుకోవడం, అలాగే స్వెట్టర్లు (Sweaters) ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరం అయితే తప్ప, రాత్రివేళల్లో బయటకు రాకుండా చూసుకుంటున్నారు.

Cold Wave

ఈ వాతావరణంలో చిన్నారులను, చంటిపాపలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఇళ్లలో ఉన్న వృద్ధులను (Elders) కూడా అదే విధంగా ప్రత్యేక శ్రద్ధతో (Special Care) చూసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది తమ ఇళ్లలో రూమ్ హీటర్లను (Room Heaters) అమర్చుకుంటున్నారు.

చలి తీవ్రత వల్ల చాలామంది జలుబు, దగ్గు (Cold and Cough), జ్వరాల (Fevers) బారిన పడుతున్నారు. ఈ లక్షణాలు ఎక్కువ కావడంతో కొందరు ఆసుపత్రులలో (Hospitals) కూడా చేరుతున్నారు. అందుకే, ఈ చలికాలంలో తగినన్ని వెచ్చని దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీరు (Lukewarm Water) తాగడం, అలాగే వృద్ధులు, చిన్న పిల్లలు చల్లని గాలులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version