Ajwain
మన ఇంటి పోపుల పెట్టెలో ఎప్పుడూ కనిపించే ఈ చిన్న గింజలో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రుచిని పెంచే సుగంధ ద్రవ్యంగా మాత్రమే మనం వాడే ఈ వాము (ఓమ).. ఒక మహాభాగ్యం లాంటిది. అనాదిగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడబడుతున్న ఈ గింజ, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కేవలం చిన్న మార్పుతో, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ వాము(Ajwain) ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతిరోజూ మనల్ని ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత సమస్యలకు వాము ఒక అద్భుతమైన పరిష్కారం. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలోని శక్తివంతమైన రసాయనాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడి, బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఒక స్పూన్ వాము తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన రక్తపోటు, ఒత్తిడిని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
వాము(Ajwain)లో ఉండే థైమోల్ అనే రసాయనం ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు వాము అద్భుతంగా పనిచేస్తుంది. వాము నీటిని మరిగించి, కొద్దిగా పసుపు, తేనె కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, తలనొప్పి, మైగ్రేన్, అలసట నుంచి కూడా వాము ఉపశమనం అందిస్తుంది.
Curry leaves: మీ డైట్‌లో కరివేపాకు ఎందుకు ఉండాలంటే..
ఇది శరీరానికి మాత్రమే కాదు, కొన్ని సౌందర్య సమస్యలకు కూడా సహాయపడుతుంది. వాము (Ajwain)ఆకులను క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుందని చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం, దీనిలోని అనస్తిటిక్ విలువలు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఇక, పొట్టలో ఆమ్లత్వాన్ని తగ్గించే గుణం ఉండటం వల్ల చిన్నపిల్లలకు గ్యాస్, అజీర్తి తగ్గించే సిరప్‌లలో వాము నీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వాముతో మరిన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. వాములో కొద్దిగా ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరిచేరవు. ఇలా, వాము మన ఆరోగ్యాన్ని, జీవనాన్ని ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది.