Curry leaves: మీ డైట్‌లో కరివేపాకు ఎందుకు ఉండాలంటే..
Curry leaves: కరివేపాకుని పచ్చడి రూపంలో, పొడిగా, కషాయంగా, లేదా స్మూతీగా తీసుకున్నా మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

Curry leaves
మనం తరచుగా వంటల్లో ఉపయోగించే కరివేపాకు(Curry leaves), కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే కాదు. ఈ ఆకులో లెక్కలేనన్ని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండూ కరివేపాకులోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను వెల్లడించాయి. దీనిని పచ్చడి రూపంలో, పొడిగా, కషాయంగా, లేదా స్మూతీగా తీసుకున్నా మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కేవలం దీని వాసన చూడటం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కరివేపాకు(Curry leaves)లో ఉండే ‘కార్బొజోల్ ఆల్కలాయిడ్స్’ అనే సమ్మేళనాలు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి యాంటీబయాటిక్, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేసి మన శరీరానికి రక్షణ కవచంలా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ముఖ్య అవయవాలకు హాని జరగకుండా చూస్తాయి. దీన్ని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులోకి వచ్చి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు(curry leaves) ఒక అద్భుతమైన ఔషధం. రోజూ వ్యాయామంతో పాటు తాజా కరివేపాకు తీసుకుంటే జీవక్రియలు మెరుగుపడి, బరువు త్వరగా తగ్గుతారు. ఇది జీర్ణ సంబంధ సమస్యలైన విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పికి మంచి పరిష్కారం. ఎండిన కరివేపాకును మెత్తగా పొడి చేసి మజ్జిగలో కలిపి ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. మహిళల ఆరోగ్యానికి కూడా కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. గర్భిణుల్లో వచ్చే వాంతులు, వికారం, రక్తహీనత వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. అంతేకాదు, రుతుక్రమ సమస్యలు, శరీర నొప్పులు వంటి వాటి నుంచి కూడా ఇది ఉపశమనం ఇస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకు ఒక వరం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమ కణాలకు రక్షణ కల్పించి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. కంటి చూపుకి కూడా ఇది చాలా మంచిది. కరివేపాకులో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటిశుక్లాలను రాకుండా నిరోధిస్తుంది. కాలిన గాయాలపై కరివేపాకు పేస్ట్‌ను పూస్తే, దానిలో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ గాయాలను త్వరగా నయం చేస్తాయి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జుట్టు సంరక్షణలోనూ దీని పాత్ర కీలకం. కరివేపాకు పేస్ట్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా, చుండ్రును తగ్గించి, తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. చివరిగా, కరివేపాకు జ్ఞాపకశక్తికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని రోజూ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి, అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది.
Also Read: Chicken : మీరు రోజూ చికెన్ తినే బ్యాచేనా? అయితే అర్జంటుగా ఆపేయండి