Dinner
బరువు తగ్గాలనుకునేవారికి రాత్రి భోజనం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో తక్కువగా, తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి, అలాగే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సూప్ ..డిన్నర్(Dinner)లో సూప్ తీసుకోవడం బరువు తగ్గడానికి ఒక సులభమైన మార్గం. సూప్‌లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ కడుపును నింపుతాయి. దీనివల్ల ఆటోమేటిక్‌గా తక్కువ ఫుడ్ తింటాం. సూప్‌లో కూరగాయలు ఎక్కువగా వేసుకుంటే ఫైబర్, నీటి శాతం పెరిగి కడుపు నిండుగా ఉంచుతాయి.
దాలియా (గోధుమ రవ్వ)..దాలియాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. దాలియా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీంతో రాత్రిపూట త్వరగా ఆకలి వేయదు. తక్కువ పరిమాణంలో తిన్నా కూడా కడుపు నిండుగా ఉన్న అనుభూతినిస్తుంది.
రోస్టెడ్ చికెన్..నాన్‌వెజ్ ఇష్టపడేవారికి రోస్టెడ్ చికెన్ ఒక మంచి ఎంపిక. చికెన్‌లో ఉండే అధిక ప్రోటీన్ శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది, తద్వారా రాత్రి పూట మళ్లీ మళ్లీ తినాలనే కోరిక తగ్గుతుంది. బటర్ లేదా క్రీమ్ లేకుండా, కాల్చిన (రోస్టెడ్) చికెన్ తినడం మంచిది. బ్రెడ్‌కి బదులుగా చపాతీతో తీసుకుంటే మరింత ఆరోగ్యకరం.
వెజిటేబుల్ ఫ్రై..బరువు తగ్గడానికి వెజిటేబుల్ ఫ్రై ఒక అద్భుతమైన మార్గం. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కూరగాయల్లోని పోషకాలు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ నూనెకు బదులు ఆలివ్ ఆయిల్ ఉపయోగించి వెజిటేబుల్ ఫ్రై చేసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ హెల్దీ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు రాత్రి భోజనం ఏడు గంటలలోపు తింటే మంచిఫలితాలు వస్తాయి. లేదంటే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు మీ భోజనం కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి.