Wash your feet
భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా పెద్దలు తరచుగా చెప్పే మాట. “రాత్రి బయట తిరిగి వచ్చాక, నిద్రపోయే ముందు తప్పకుండా కాళ్లు (Wash your feet)కడుక్కోవాలి.” ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దీని వెనుక ఆరోగ్యం, ఆధ్యాత్మికత, వాస్తు ,జ్యోతిష్య శాస్త్రాలకు సంబంధించిన అనేక లోతైన ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయ అలవాటును ఆచరించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చని పురాణాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి.
ఆరోగ్యం, మానసిక ప్రశాంతత.. పడుకునే ముందు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో పాదాల(Wash your feet)ను కడుక్కోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. రోజంతా పేరుకుపోయిన శారీరక అలసట, ముఖ్యంగా పాదాల నొప్పులు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
రోజంతా మనలో పేరుకుపోయిన ఎమోషనల్ ఫీలింగ్స్ , తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. కాళ్లు కడుక్కునేటప్పుడు జరిగే చిన్నపాటి మసాజ్, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల అశాంతి తొలగిపోయి, మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ఫలితంగా గాఢమైన, నాణ్యమైన నిద్ర పడుతుంది. ముఖ్యంగా పీడకలలు, నిద్రలేమితో బాధపడే వారికి ఈ అలవాటు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, పాదాలను శుభ్రం (Wash your feet)చేసుకోవడం ఇంటిలోకి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఒక మార్గం. రోజంతా మనం అనేక ప్రదేశాలలో తిరుగుతాం. ఆయా ప్రదేశాల నుంచి కొంత నెగటివ్ ఎనర్జీ లేదా అశుభ్రత మన పాదాల ద్వారా ఇంటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. రాత్రి పూట పాదాలు కడుక్కోవడం వల్ల ఆ నెగటివ్ శక్తి ఇంటి ఆవరణలోనే తొలగిపోతుంది. ఇది కుటుంబంలో సానుకూల దృక్పథం (పాజిటివ్ వైబ్స్) తీసుకురావడానికి, ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి దోహదపడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవడం అనేది వ్యక్తి జాతకంలో శని (శనీశ్వరుడు) స్థానాన్ని బలపరుస్తుందని, శని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శని గ్రహం న్యాయానికి, కర్మకు, పట్టుదలకు కారకుడు. శుభ్రతను పాటించడం , పాదాలను కడుక్కోవడం ద్వారా అదృష్టం, సానుకూలతను ఇంట్లోకి ఆహ్వానించినట్లే. శని అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన పనుల్లో, ఆర్థికంగా ఉండే అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయని, వృత్తి, వ్యాపారాలలో విజయాలు లభిస్తాయని జ్యోతిష్యులు పేర్కొంటారు.
అందుకే, కాళ్లు కడుక్కోవడం అనేది కేవలం పరిశుభ్రతకు సంబంధించిన చర్య మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ,జ్యోతిష్య ప్రయోజనాలను అందించే ఒక సమగ్ర సంప్రదాయంగా భావించొచ్చు.
