Tea
ఒత్తిడి నుంచి బయటపడటానికి, లేదా అలసట నుంచి రిలాక్స్ అవ్వడానికి టీ తాగితే మంచిదే కానీ, అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
tea భారతీయులలో టీ తాగే అలవాటు ఎప్పటినుంచో ఉంది. కొందరికి ఉదయం లేచిన తరువాత, అలాగే సాయంత్రం వేళల్లో టీ తాగనిదే రోజు మొదలవదు.
ఒత్తిడి నుంచి బయటపడటానికి, లేదా అలసట నుంచి రిలాక్స్ అవ్వడానికి టీ తాగితే మంచిదే కానీ, అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకున్న వెంటనే టీని అస్సలు తాగొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
టీ(Tea) తాగకూడని ముఖ్య సందర్భాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా చల్లటి పానీయాలు (కోల్డ్ డ్రింక్స్) లేదా చల్లటి ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే టీ తాగకూడదు. ఇలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పులు వచ్చి, అది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వేడి, చల్లటి పదార్థాలను వెంటవెంటనే తీసుకోవడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ నియమం చల్లటి నీరు తాగిన తర్వాత కూడా వర్తిస్తుంది.
చాలా మంది నిమ్మరసం (Lemon Juice) తాగిన వెంటనే టీని తీసుకుంటారు. నిపుణుల ప్రకారం, ఇది చాలా పొరపాటు. నిమ్మరసం, టీలోని రసాయనాలు కలవడం వలన అసిడిటీ (Aciditiy) సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనివల్ల కడుపులో మంట, ఛాతీలో నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
భోజనం (అన్నం, కూరలు) చేసిన తర్వాత కూడా వెంటనే టీ తీసుకోవడం మానేయాలి. భోజనం ద్వారా శరీరంలోకి చేరిన ఐరన్ (Iron) వంటి ముఖ్యమైన పోషకాలను, టీలో ఉండే టానిన్స్ (Tannins) అనే రసాయనాలు శోషించకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా శరీరానికి పోషకాలు అందవు. అంతేకాక, భోజనం తర్వాత టీ తాగడం రక్తపోటు (Blood Pressure) సమస్యలకు దారితీయవచ్చు,దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా అట్లు, దోశలు, శెనగపిండితో (Besan) చేసిన ఆహార పదార్ధాలను తిన్న తర్వాత టీని అస్సలు తీసుకోకూడదు. ఈ పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటి తర్వాత టీ తాగితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు మరింత వేధించే అవకాశం ఉంటుంది.
