Hibiscus: మందారం ఆకులు, పూలతో బరువు తగ్గొచ్చట..

Hibiscus: మందార పూల నుంచి ఆకుల వరకూ ప్రతీ భాగంలోనూ ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Hibiscus

మామూలుగా మందార పూలంటే దేవుడికి పెట్టేవి, లేదంటే అందమైన గార్డెన్‌ను అలంకరించేవి అనుకుంటాం. కానీ ఆయుర్వేదంలో దీనికి ఉన్న స్థానం వేరు. మందార పూల నుంచి ఆకుల వరకూ ప్రతీ భాగంలోనూ ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మందారం పూలను ఎండబెట్టి పొడి చేసుకొని, లేదా డికాక్షన్ లాగా తాగితే మనకు కలిగే లాభాలు చూద్దాం.

1. డయాబెటిస్ నియంత్రణ కోసం(Hibiscus).. చాలా మందిని ఇబ్బంది పెట్టే డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో మందారం చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేలా చేస్తుంది.

2. హైబీపీకి చెక్ పెట్టడానికి(Hibiscus).. హైబీపీ సమస్య ఉన్నవాళ్లకు మందారం ఒక మంచి ఔషధం. మందారం డికాషన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది.

3. గుండెకు రక్షణకు.. మందారం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.

4. మలబద్ధకం దూరం చేయడంలో.. మలబద్ధకంతో బాధపడే వాళ్లకి మందారం ఒక దివ్య ఔషధం. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలను తగ్గిస్తుంది.

Hibiscus

5. చర్మానికి మెరుపు కోసం.. చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో కూడా మందారం ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను తొలగించి, చర్మాన్ని చాలా సాఫ్ట్‌గా ఉంచుతుంది.

6. బరువు తగ్గడంలో..బరువు తగ్గాలనుకునే వాళ్లకు మందారం బెస్ట్ ఆప్షన్. ఇది శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి, ఒబెసిటీని కంట్రోల్ చేస్తుంది.

7. జుట్టు సంరక్షణలో.. మందార ఆకులు, రేకులు సహజమైన కండీషనర్ లాగా పనిచేస్తాయి. జుట్టును మరింత నల్లగా, ఆరోగ్యంగా మార్చడమే కాకుండా, చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి.

8. స్కిన్ క్యాన్సర్ నిరోధంలో..మందారంలో కొన్ని ప్రత్యేక గుణాలు ఉండడం వల్ల అది స్కిన్ క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

చూశారుగా, కేవలం అందానికే కాదు, మందారం మన ఆరోగ్యానికీ ఎంత మేలు చేస్తుందో. ఇకపై మీరు మందారాన్ని ఒక పూవుగా కాకుండా, ఒక ఆయుర్వేద ఔషధంగా కూడా చూస్తూ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

 

Exit mobile version