DMart : డీమార్ట్‌లో ఊహించని డిస్కౌంట్లు కావాలంటే ఈ రోజుల్లోనే వెళ్లండి..

DMart : డీమార్ట్‌లో షాపింగ్ అంటేనే బంపర్ డీల్స్‌ అన్న మాట..నీ ఈ రోజులలో వెళ్తే అసలు మజా వస్తుందట..

DMart

చౌక ధరలకు మంచి నాణ్యత గల వస్తువులు కావాలంటే సాధారణంగా అందరి మెదడులో మెరవేది ఒకే పేరు .. డీమార్ట్ (DMart)! గుండుసూదిలా చిన్నవి నుంచి, గృహోపకరణాల వరకు ఒకే చోట, అతి తక్కువ ధరకు అందించడమే దీని ప్రత్యేకత. కానీ చాలామందికి తెలియని ఓ రహస్యముంది. డీమార్ట్‌లో ప్రతీ రోజూ ధరలు ఒకేలా ఉండవు.అందుకే డీ మార్ట్‌కు వెళ్లే షాపింగ్ సీక్రెట్( Shopping Secrets) తెలుసుకోవాలంటారు నిపుణులు.

కొనుగోలుదారులు పెద్దఎత్తున డీమార్ట్‌ (DMart)కి వారాంతాల్లో – అంటే శుక్రవారం నుంచి ఆదివారాల మధ్యే వెళ్లేలా చూస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద డిస్కౌంట్లు, ‘బై వన్ గెట్ వన్’ లాంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. దుస్తులు, కిరాణా, పర్సనల్ కేర్… ఇలా చాలా విభాగాల్లో భారీ తగ్గింపులు కనిపిస్తాయి. అందుకే ఈ రోజుల్లో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కొనగలుగుతారు.

అలాగే డీ మార్ట్ (DMart) గురించి మరో సీక్రెట్ కూడా ఉంది. సోమవారం అంటే చాలామంది షాపింగ్‌కి వెళ్లరు. కానీ డీమార్ట్‌లో మాత్రం ఈ రోజు ‘క్లీన్-అప్ సేల్’ జరుగుతుంది. వారాంతాల్లో మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేయడం కోసం చాలా వస్తువులపై చౌక ధరలతో ఆఫర్లు అందిస్తారు. అయితే ఇది ప్రతీసారి, ప్రతి బ్రాంచ్‌లో ఉండకపోవచ్చు. కాబట్టి మీ దగ్గరలోని డీమార్ట్ స్టోర్‌కి ముందు ఫోన్ చేసి లేదా అక్కడికి వెళ్లి తెలుసుకుంటే, ఖర్చు తగ్గించుకునే బంగారు అవకాశాన్ని కొట్టేసినట్టే.

Dmart

ఇంతే కాదు, పండగల సమయంలో డీమార్ట్ అసలైన ధమాకా ఆఫర్లతో వస్తుంది . దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, హోళీ… ఇలా ప్రతి ఫెస్టివల్‌కు ముందు ముందు ప్రత్యేక సేల్‌లు నిర్వహిస్తూ, అదనపు తగ్గింపులతో కస్టమర్లకు ఊపు తెస్తుంది.

ఇంకో చిట్కా – డీమార్ట్ ఆన్‌లైన్ యాప్‌ ద్వారా కొనుగోలు చేసే వారికీ సోమవారం, బుధవారం రోజుల్లో ‘ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్’ లభిస్తుంటాయి. రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉంటే, హాట్ కూపన్లు పట్టేసే అవకాశముంది. ఒక్క మాటలో చెప్పాలంటే… డీమార్ట్‌కి సరైన టైమ్‌కి వెళ్తే మీ బడ్జెట్‌లో బంపర్ డిస్కౌంట్లు బోలెడు కొనేసుకోవచ్చు.

Also Read: ACA elections: ఏసీఏకి మళ్లీ అదే జోడీ: చిన్ని,సతీష్ ఏకగ్రీవం ?

 

Exit mobile version