Just Andhra PradeshJust SportsLatest News

ACA elections: ఏసీఏకి మళ్లీ అదే జోడీ: చిన్ని,సతీష్ ఏకగ్రీవం ?

ACA elections: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) పీఠంపై మరోసారి ఎంపీ కేశినేని చిన్ని, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తన హవా కొనసాగించనున్నారు.

ACA elections

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA elections) పీఠంపై మరోసారి ఎంపీ కేశినేని చిన్ని, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తన హవా కొనసాగించనున్నారు. గతసారి లాగే ఈసారి కూడా అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పోటీ లేకుండానే ఈ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికవుతుండడం ఖాయం అయింది.

అవును ఏసీఏ పీఠం(ACA elections)పై మరోసారి అదే నాయకత్వ జోడీ గెలుపు ఖాయమైంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని( Keshineni Chinni), రాజ్యసభ సభ్యుడు సానా సతీష్(Sana Satish) మరోసారి వరుసగా అధ్యక్షుడు, కార్యదర్శిగా ఎన్నికవుతున్నారు. నామినేషన్ గడువు ఆదివారంతో ముగియగా… వీరి పదవులకు పోటీదారులు లేరు. దీంతో ఎన్నికలు నిర్వహించే అవసరమే లేకుండా పోయింది.

మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. చిన్ని తరఫున డాక్టర్ కే.గోవిందరెడ్డి, సతీష్ స్వయంగా తన నామినేషన్ దాఖలు చేశారు. జాయింట్ సెక్రటరీ పదవికి మాత్రం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మిగిలినవన్నీ ఏకగ్రీవమే కావడంతో వీరి గెలుపు లాంఛనమైంది.

ACA elections
ACA elections

ఇప్పటికే ఈ పదవులకు అభ్యర్థులుగా చిన్ని (అధ్యక్షుడు), సతీష్ (కార్యదర్శి), బండారు నరసింహారావు (ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ (కోశాధికారి), విష్ణు తేజ్ (కౌన్సిలర్) మాత్రమే నామినేషన్లు వేశారు. జాయింట్ సెక్రటరీగా విజయ్ కుమార్, శ్రీనివాసరాజు పోటీలో ఉన్నారు. ఈనెల 6న నామినేషన్ల పరిశీలన, 11వ తేదీ వరకు ఉపసంహరణ గడువు, అవసరమైతే 16న పోలింగ్ జరగనుంది. మొత్తం మీద ఏసీఏపై మళ్లీ అదే జంట తన ప్రభావాన్ని కొనసాగించనుంది.

ఆదివారంతో నామినేషన్ల గడువు ముగియగా… జాయింట్ సెక్రటరీకి మినహా మిగిలిన అన్ని పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చాయి. దీంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఇప్పటికే తెలుస్తోంది.

Also read: Tollywood: టాలీవుడ్‌కు టెంపరరీ బ్రేక్..

Related Articles

Back to top button