Toe Rings
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో వధువు కాలికి మెట్టెలు (Toe Rings) తొడుగుతారు. పెళ్లైన ప్రతి మహిళ వీటిని ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. అయితే మెట్టెలు ఎందుకు ధరిస్తారు, అందులోనూ వెండి (Silver) మెట్టెలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
కాలికి మెట్టెలు(Toe Rings) ధరించడం వెనుక పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. ముఖ్యంగా రామాయణంలో సీతను రావణాసురుడు అపహరించినప్పుడు ఈ మెట్టెల పాత్ర కీలకం. ఆమెను ఎవరు తీసుకెళ్లారో రాముడు గుర్తించే విధంగా, సీత తెలివిగా తన కాలి మెట్టెలను కింద పడేసిందట. ఆ ఆధారంతోనే సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లాడని రాముడు గుర్తించగలిగాడట.
అలాగే మహిళల కాలి వేలికి మెట్టెలు తొడగడం వెనుక బలమైన శాస్త్రీయ ఆరోగ్య కారణాలు ఉన్నాయి.
గైనిక్ సమస్యల నివారణ.. మహిళల కాలి వేళ్లలో (ముఖ్యంగా రెండవ వేలు) సున్నితమైన నరాలు గుండె నుంచి గర్భాశయం వరకు అనుసంధానం అయి ఉంటాయి. మెట్టెలు ధరించడం వల్ల ఆ నరాలు ఉత్తేజితం అవుతాయి. ఇది శరీర వ్యవస్థను సమతుల్యం చేస్తుంది (Body System Balance), పునరుత్పత్తి వ్యవస్థ (Reproductive System) సరిగా పని చేయడానికి తోడ్పడుతుంది.
పీరియడ్స్ నియంత్రణ.. మెట్టెలు (Toe Rings)ధరించడం వల్ల పీరియడ్స్ సమస్యలు తొలగిపోయి, గర్భం దాల్చే అవకాశం కూడా పెరుగుతుంది.
సుఖ ప్రసవం.. మెట్టెలు ధరించే భాగం సంతానాభివృద్ధికి, సుఖ ప్రసవానికి అనుకూలమైన నాడులను సున్నితంగా నొక్కుతూ ఉంటుంది. అందుకే పూర్వీకుల నుంచి మెట్టెలు ధరించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
ధనవంతులైనా మెట్టెల విషయంలో బంగారం కంటే వెండికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తారంటే, వెండి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఉన్న శక్తిని (Energy) వెండి పీల్చుకోకుండా, భూమి నుంచి శక్తిని గ్రహించి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. బంగారం వేడిని పెంచితే, వెండి శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది.