Negative Energy
చాలా ఇళ్లలో ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు ఏమీ లేకపోయినా, కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలా మనశ్శాంతి కరువవ్వడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వంటివి.. నెగిటివ్ ఎనర్జీ (Negative Energy)వల్ల జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మన ఇంటి నిర్మాణంలో లేదా వస్తువుల అమరికలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి వాటి ద్వారా ఈ ప్రతికూల శక్తి(Negative Energy)ని తొలగించి, సానుకూలతను (Positive Energy) నింపుకోవచ్చని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.
ముందుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ కూడా పరిశుభ్రత చాలా ముఖ్యం. లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశించే ద్వారం ఎప్పుడూ వెలుతురుతో, అందంగా ఉండాలి. ద్వారం వద్ద చెప్పులు చెల్లాచెదురుగా పెట్టకూడదు.
అలాగే ఎవరి ఇంట్లో అయినా విరిగిపోయిన వస్తువులు, పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, గాజు ముక్కలు ఉంటే వాటి వల్ల తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే వాటిని వెంటనే తొలగించాలి.
వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలో ఉండాలి, ఒకవేళ కుదరకపోతే కనీసం స్టవ్ నైనా ఆ దిశలో ఉంచాలి. నీరు , అగ్ని ఒకే దగ్గర ఉండకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి.
మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, వారానికి ఒకసారి అయినా ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు (Sea Salt) కలపండి. సాల్ట్‌కు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుంది. ఇంటి మూలల్లో ఒక గిన్నెలో ఉప్పు ఉంచి, ప్రతి వారం దాన్ని మారుస్తూ ఉండటం వల్ల ప్రతికూలత తగ్గుతుంది.
పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు, ఇది దంపతుల మధ్య విభేదాలకు దారి తీస్తుంది.
సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేయడం, ధూపం వేయడం వల్ల దుష్టశక్తులు పారిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ చిన్న మార్పులు చేయడం వల్ల.. ఇంట్లో ప్రశాంతతను పెంచి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చిగురించేలా చేస్తాయని సూచిస్తుంది.
Railway Station:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ చేస్తున్నారా?.. కొత్త రూల్స్ తెలుసుకోండి
