Railway Station:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేస్తున్నారా?.. కొత్త రూల్స్ తెలుసుకోండి
Railway Station: ప్లాట్‌ఫాం నంబర్ 1 వైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు అక్కడ పార్కింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు
Railway Station
దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైన,పెద్దదయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Railway Station)లో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 714 కోట్ల రూపాయలతో జరుగుతున్న ఈ పనుల వల్ల స్టేషన్ ముఖచిత్రం మారిపోబోతోంది. అయితే, ఈ పనుల వల్ల ప్రయాణికులు కొన్ని నెలలుగా తాత్కాలిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ముఖ్యంగా ప్లాట్‌ఫాం నంబర్ 1 వైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు అక్కడ పార్కింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. కేవలం 15 నిమిషాల లోపు వాహనాన్ని ఆపి, ప్రయాణికులను డ్రాప్ చేసి లేదా పికప్ చేసుకుని వెళ్లడానికి మాత్రమే అనుమతిని ఇస్తున్నారు. ఆ సమయం దాటితే భారీగానే జరిమానా విధిస్తున్నారు.
ప్రస్తుతం వెహికల్ పార్కింగ్‌ను ప్లాట్‌ఫాం నంబర్ 10 వైపు ఉన్న బేస్మెంట్కు మళ్లించారు. కొత్తగా నిర్ణయించిన పార్కింగ్ ధరల ప్రకారం.. ఫోర్ వీలర్లకు మొదటి రెండు గంటలకు 40 రూపాయలు, ఆ తర్వాత ప్రతీ గంటకు 20 రూపాయల చొప్పున పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
టూ వీలర్లకు మొదటి రెండు గంటలకు 25 రూపాయలు, తదుపరి గంటకు 10 రూపాయలు చెల్లించాలి. ఈ పెంపు ప్రయాణికులపై కొంత ఆర్థిక భారం మోపినట్లు అనిపించినా, స్టేషన్ ప్రాంగణంలో క్రమశిక్షణను కాపాడటానికి , అనధికార పార్కింగ్‌ను అరికట్టడానికి ఈ చర్యలు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.

ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ఒక రకంగా బెనిఫిట్ కూడా పొందొచ్చు. గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Railway Station) ప్లాట్‌ఫాం 1 వద్ద విపరీతమైన రద్దీ వల్ల రైలు అందక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అక్కడ కేవలం పికప్/డ్రాప్ మాత్రమే ఉండటం వల్ల వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి.
స్టేషన్ పునరాభివృద్ధి పనులు 2026 డిసెంబర్ నాటికి పూర్తయ్యాక, ప్రపంచస్థాయి మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం ఎలాగూ అందుబాటులోకి వస్తుంది. అప్పటివరకు ప్రయాణికులు ప్లాట్‌ఫాం 10 వైపు ఉన్న బేస్మెంట్ పార్కింగ్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
SIT:మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్.. కేసీఆర్‌కీ సిట్ నోటీసులు తప్పవా?




One Comment