Study:చదివిన విషయాలు గుర్తుండాలంటే ఈ ట్రిక్ వాడండి..

Study: చదివిన విషయాల మధ్య సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం వల్ల.. మెదడు ఆ సమాచారాన్ని అంతా మర్చిపోకుండా స్టోర్ చేసుకుంటుంది.

Study

పరీక్షల సమయంలోనో లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు కొంతమంది విద్యార్ధులు గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. కానీ తీరా చూస్తే ఏమీ గుర్తుండదు.

దీనికి పరిష్కారమే సైకాలజీలో చెప్పబడిన ‘స్పానింగ్ ఎఫెక్ట్’ (Spacing Effect). అంటే ఒకే సమాచారాన్ని ఒకేసారి గంటల తరబడి చదవడం కంటే కూడా.. విరామాలిస్తూ చదవడం వల్ల మెదడు దానిని దీర్ఘకాల జ్ఞాపకశక్తి (Long-term memory) లో భద్రపరుస్తుందని సైకాలజీ చెబుతుంది.

ఎందుకంటే మన మెదడుకు ఒక పరిమితి ఉంటుంది. వరుసగా చదువుకుంటూ పోతే ‘కాగ్నిటివ్ లోడ్’ పెరిగిపోయి మెదడు అలసిపోతుంది. స్పానింగ్ ఎఫెక్ట్ ప్రకారం, ఎవరైనా ఒక విషయాన్ని ఈరోజు చదివితే, మళ్లీ దానిని రేపు, ఆ తర్వాత మూడు రోజులకు, ఆపై ఒక వారానికి రివిజన్ చేస్తేనే మంచి ఫలితముంటుంది.

ఇలా చదివిన విషయాల మధ్య సమయాన్ని పెంచుకుంటూ వెళ్లడం వల్ల.. మెదడు ఆ సమాచారాన్ని అంతా మర్చిపోకుండా స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల పరీక్షల సమయంలో చివరి నిమిషంలో.. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.

Study

దీనిని విద్యార్థులు ఎలా పాటించాలంటే.. ప్రతి 45 నిమిషాల చదువు తర్వాత ఒక 10 నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. ఆ విరామంలో చదివిన దాని గురించి ఆలోచించకుండా కాసేపు ప్రశాంతంగా ఉండాలి. కానీ మళ్లీ చదవడం ప్రారంభించినప్పుడు పాత విషయాలను ఒకసారి రివైజ్ చేసుకోవాలి.

ఈ పద్ధతి కేవలం చదివింది గుర్తు పెట్టుకోవడానికే కాదు, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా కూడా, ఆఫీసు పనులు చేయాలన్నా చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడానికి ‘స్పానింగ్ ఎఫెక్ట్’ ఒక అద్భుతమైన టెక్నిక్ అంటారు నిపుణులు.

Speaker:తెలంగాణలో ఫిరాయింపుల మలుపు..స్పీకర్ తీర్పుతో మారిన సమీకరణాలు

 

Exit mobile version