Exercises: బట్టతల, బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టాలంటే..మగవారికి 3 ఎక్సర్‌సైజులు మస్ట్..

Exercises: మగవారికి ఈ మూడు ఎక్సర్‌సైజులతో అద్భుతమైన లాభాలు

Exercises

ఒకప్పుడు ఫిట్‌నెస్, అందం గురించి అమ్మాయిలు మాత్రమే కేరింగ్ చూపేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అబ్బాయిలు కూడా తమ ఆరోగ్యం, లుక్ విషయంలో చాలా కేరింగ్ చూపిస్తున్నారు. బాడీ బిల్డింగ్ కోసం కష్టపడుతూ, హెయిర్ కేర్, స్కిన్ కేర్ కోసం స్పెషల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని రకాల ఎక్సర్‌సైజులు కేవలం కండలను పెంచడమే కాకుండా, స్కిన్, హెయిర్ హెల్త్‌ను కూడా మెరుగుపరుస్తాయి.

ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం, రెగ్యులర్‌గా కొన్ని ఎక్సర్‌సైజులు (exercises)చేయడం వల్ల బాడీలో టెస్టోస్టిరాన్, ఇతర ఇంపార్టెంట్ హార్మోన్లు పెరిగి, డోపమైన్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ తగ్గి, జుట్టు ఒత్తుగా పెరిగి, చర్మం గ్లో అవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలకు అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే మూడు బెస్ట్ ఎక్సర్‌సైజులు ఇక్కడ ఉన్నాయి.

1. స్క్వాట్స్ (Squats):
శరీరానికి స్ట్రెంత్ ఇచ్చే ముఖ్యమైన ఎక్సర్‌సైజుల్లో (Exercises) స్క్వాట్స్ ముందుంటాయి. నిలబడి, కుర్చీలో కూర్చున్నట్లుగా వెనుకకు వంగి లేవడం ఈ ఎక్సర్‌సైజ్. ఇది కాళ్ళ కండలను మాత్రమే కాదు, పొట్ట, వీపు, మరియు భుజాల కండలను కూడా గట్టిగా చేస్తుంది. స్క్వాట్స్ సరిగ్గా చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. మీరు స్టాండర్డ్ స్క్వాట్స్‌తో స్టార్ట్ చేసి, ఆ తర్వాత జంపింగ్ స్క్వాట్స్, గోబ్లెట్ స్క్వాట్స్, సుమో స్క్వాట్స్ వంటి వాటిని కూడా ట్రై చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి.

Exercises-Squats

2. డెడ్‌లిఫ్ట్ (Deadlift):
డెడ్‌లిఫ్ట్ ఒక అత్యంత పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజ్. నేలపై ఉన్న వెయిట్‌ను బార్‌బెల్ లేదా డంబెల్ సాయంతో చేతులతో ఎత్తడం ఈ వ్యాయామం. పవర్ లిఫ్టింగ్‌లో ఇది ఒక మెయిన్ పార్ట్. కరెక్ట్‌గా డెడ్‌లిఫ్ట్ చేయడం వల్ల వెన్నెముక, వీపు కండరాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీనివల్ల కండల పెరుగుదల, బాడీ స్ట్రెంత్ పెరుగుతుంది. బరువు పెంచాలనుకుంటే బార్‌పై వెయిట్‌ను పెంచితే సరిపోతుంది. ఇది మీ గ్రిప్‌తో పాటు మొత్తం బాడీ స్ట్రెంత్‌ను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Exercises-Deadlift

3. చెస్ట్ ప్రెస్ (Chest Press):
చెస్ట్ కండరాలను స్ట్రాంగ్ చేయడానికి చెస్ట్ ప్రెస్ సూపర్ పనిచేస్తుంది. బెంచ్‌పై పడుకొని బార్‌బెల్ లేదా డంబెల్స్‌ను ఛాతీపై నుంచి పైకి లేపడం ఈ ఎక్సర్‌సైజ్. ఈ ఎక్సర్‌సైజులు భుజాలు, చేతులు, ఛాతీ కండరాలకు మంచి స్ట్రెంత్ ఇస్తాయి. దీని వల్ల ఛాతీ మరింత వెడల్పుగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. వేర్వేరు యాంగిల్స్‌లో ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల చెస్ట్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి.

Exercises-Chest-Press

ఈ మూడు ఎక్సర్‌సైజు(Exercises)లు చేయడం వల్ల అబ్బాయిలు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటంతో పాటు, స్కిన్ గ్లో అయ్యి, హెయిర్ గ్రోత్ కూడా మెరుగుపడుతుంది. అయితే కేవలం ఎక్సర్‌సైజులతోనే కాదు, సరైన డైట్ ఫాలో అవ్వడం కూడా చాలా ముఖ్యం. ఇప్పటికే జుట్టు రాలడం, బెల్లీ ఫ్యాట్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోవడం బెస్ట్.

 

Exit mobile version