Delhi-Agra: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం..ఉసురు తీసిన పొగమంచు

Delhi-Agra: ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నాలుగు మృతదేహాలను గుర్తించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Delhi-Agra

ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై పలు బస్సుల్లో మంటలు చెలరేగాయి. పొగమంచు (Fog) కారణంగా ముందున్న కార్లను వెనుక నుంచి ఏకంగా ఏడు బస్సులు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు నాలుగు మృతదేహాలను గుర్తించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Delhi-Agra

ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. తక్కువ విజిబిలిటీ (దృశ్యమానత) కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version