HDFC:హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్.. రెండు రోజులు యూపీఐ సేవలు బంద్!
HDFC: మెయింటెనెన్స్ (Maintenance) పనుల కారణంగా రెండు వేర్వేరు తేదీల్లో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.
HDFC
దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక బిగ్ అలర్ట్ (Big Alert) జారీ చేసింది. ముఖ్యంగా యూపీఐ (UPI) సేవలు సహా ఇతర డిజిటల్ సర్వీసులకు అంతరాయం కలగనుంది. మెయింటెనెన్స్ (Maintenance) పనుల కారణంగా రెండు వేర్వేరు తేదీల్లో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.
డిజిటల్ సేవలు ఎప్పుడెప్పుడు నిలిచిపోనున్నాయి అంటే:
మొదటి విడత: డిసెంబర్ 13వ తేదీన ఉదయం 2:30 గంటల నుంచి 6:30 గంటల వరకు సేవలకు అంతరాయం కలుగుతుంది.
రెండో విడత: డిసెంబర్ 21వ తేదీన కూడా ఉదయం 2:30 గంటల నుంచి 6:30 గంటల వరకు సేవలు ఆగిపోనున్నాయి.

ఈ మెయింటెనెన్స్ సమయంలో మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు, అకౌంట్స్ (Accounts), డిపాజిట్స్ (Deposits), యూపీఐ, నెఫ్ట్ (NEFT), ఐఎమ్‌పీఎస్ (IMPS), ఆర్టీజీఎస్ (RTGS), ఆన్‌లైన్ పేమెంట్స్ (Online Payments) మరియు ఇతర సేవల్లో కూడా అంతరాయం ఏర్పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) ఒక ప్రకటనలో వెల్లడించింది.
ముఖ్యంగా, ఈ సమయంలో మీరు గూగుల్ పే, ఫోన్‌పే వంటి వివిధ యాప్స్‌లలో లింక్ చేసుకున్న హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ల నుంచి యూపీఐ సేవలను పొందలేరు. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ జారీ చేసిన రూపే కార్డులతో (RuPay Cards) కూడా యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి, ఆ సమయానికి ముందుగానే లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
అత్యవసర నగదు బదిలీ కోసం కస్టమర్లు పేజెడ్ వ్యాలెట్‌ను (PayZapp Wallet) ఉపయోగించుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సలహా ఇచ్చింది. మిగిలిన రోజుల్లో డిజిటల్ సేవలు యధావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ పేర్కొంది.



