Abhishek Sharma : యువీ చెక్కిన విధ్వంసం..రికార్డులను షేక్ ఆడిస్తున్న అభిషేక్
Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ప్లేయర్ గా చెలరేగడం వెనుక సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పాత్ర చాలా ఉంది
Abhishek Sharma
ఒక ఆటగాడిలో ఎంత టాలెంట్ ఉన్నా దానిని వెలికితీస్తేనే స్టార్ గా ఎదుగుతాడు. ఈ విషయంలో కోచ్ లేదా మెంటార్ కీలకపాత్ర పోషిస్తుంటారు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుతమైన ప్లేయర్ గా చెలరేగడం వెనుక సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పాత్ర చాలా ఉంది. ఎందుకంటే అభిషేక్ కు యువీ మెంటార్ గా వ్యవహరించాడు. కెరీర్ ఆరంభంలో అతని లోపాలను గమనించి, వాటిని అధిగమించేలా చేసి ఇప్పుడు తిరుగులేని విధ్వంసకర ఓపెనర్ గా తీర్చిదిద్దాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే యువీ చెక్కిన విధ్వంసమే అభిషేక్ శర్మ(Abhishek Sharma).. వరల్డ్ క్రికెట్ లో యువీ పేరు చెప్పగానే అందరికీ 2007 ప్రపంచకప్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీటే గుర్తొస్తుంది. ఎందుకంటే యువరాజ్ సిక్సర్ల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు.
ఇప్పుడు యువీ మార్గనిర్థేశకత్వంలో రాటుదేలిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) కూడా సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. నిజానికి అభిషేక్ శర్మ కెరీర్ మొదట్లో తన బ్యాటింగ్ బలహీనతలతో వికెట్ పారేసుకునేవాడు. అయితే యువీ శిక్షణలో బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా మెరుగుపరుచుకుని ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో యూవీ ఇచ్చిన శిక్షణ అభిషేక్ కెరీర్ నే మలుపు తిప్పింది.
ఆ టైంలోనే యువీ ఈ యువ ఓపెనర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. అభిషేక్ త్వరలోనే టీమిండియాలో మ్యాచ్ విన్నర్ గా మారతాడని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. చివరకు అదే నిజమైంది. ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా టీ ట్వంటీ ఫార్మాట్ లో అభిషేక్ షేక్ ఆడిస్తున్నాడు.
ఇటీవల భారత్ ఆసియా కప్ గెలుచుకున్నప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. యువీ తనకు ఇచ్చిన ట్రైనింగ్ గురించి కూడా పలు ఇంటర్యూల్లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) పంచుకున్నాడు. తనను ఐపీఎల్ కోసమే, లేదా భారత జట్టులో ప్లేస్ కోసమో తనను సిద్ధం చేయడం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇండియాకు మ్యాచ్ లు గెలిపించే విన్నర్ గా తనను తయారు చేస్తున్నట్టు యువీ చెప్పారని వెల్లడించాడు. తన పవర్ హిట్టింగ్ ను మెరుగుపరుచుకోవడానికి యువీ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నాడు.

ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ ట్వంటీలో దుమ్మురేపాడు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 5 వేల రన్స్ పూర్తి చేసుకున్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 25 బంతుల్లోపే అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లను దాటేసాడు. ఈ ముగ్గురు బ్యాటర్లు 25 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు చేస్తే… అభిషేక్ 8సార్లు సాధించాడు.
NATO:వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్..గ్రీన్‌లాండ్ విషయంలో నాటోతో ఒప్పందం అందుకేనా?




One Comment