December: డిసెంబర్ డెడ్‌లైన్.. ఈ నాలుగు పనులు పూర్తి చేస్తేనే కొత్త ఏడాదిలో టెన్షన్ ఉండదు!

December: డిసెంబర్ 31 లోపు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. గడువు దాటితే మీ పాన్ కార్డు రద్దయ్యే (Invalid) అవకాశం ఉంది.

December

మనం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి ఇంకొన్ని రోజులే సమయం ఉంది. ఈలోపు మీరు కచ్చితంగా పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్ధిక, సేవా సంబంధిత పనులు (Important Deadlines) ఉన్నాయి. ఈ డెడ్‌లైన్స్‌ను మిస్ అయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది.

తప్పక పూర్తి చేయాల్సిన పనులు (ముఖ్యంగా డిసెంబర్ 31 డెడ్‌లైన్స్)
పాన్-ఆధార్ లింక్ (PAN-Aadhaar Link).. డిసెంబర్ 31 లోపు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. గడువు దాటితే మీ పాన్ కార్డు రద్దయ్యే (Invalid) అవకాశం ఉంది. దీని వల్ల మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లేదా ఇతర ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు.

Decemberఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) దాఖలు.. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయనివారు (Belated Return) ఈ డిసెంబర్(December) 31 లోపు పూర్తి చేయాలి. దీని తర్వాత ఆలస్యమైన రిటర్న్ దాఖలు చేయడానికి అవకాశం ఉండదు.

ముందస్తు పన్ను (Advance Tax) చెల్లింపు.. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మూడో విడత ముందస్తు పన్ను చెల్లించడానికి డిసెంబర్ 15 వరకే టైమ్ ఉంది. ఇది మిస్ అయితే మీకు జరిమానాలు పడతాయి.

December

పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) దరఖాస్తు.. సొంత ఇల్లు లేనివారికి కేంద్రం ఇచ్చే రూ.2.5 లక్షల సహాయం పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉంది.

కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఈ-కేవైసీ (Ration Card e-KYC) పూర్తి చేసుకోవడానికి కూడా డిసెంబర్ 31 గడువు విధించారు. కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి మీ పేరు తొలగించి, రేషన్ సరుకులు ఆగిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version