No rain ఈ ప్రదేశంలో ఎప్పుడూ వర్షం పడదట తెలుసా?
No rain: భూమికి 3,200 మీటర్ల ఎత్తులో, మేఘాలు ఉండే ప్రదేశం కంటే ఎత్తులో ఒక కొండపై ఉంది.ఈ గ్రామంలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది

No rain
భూమిపై ప్రతి చోటా ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుంది. కానీ, ఒక గ్రామం మాత్రం ఇప్పటివరకు వర్షం లేకుండానే ఉంది. అది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న అల్-హుతైబ్ అనే గ్రామం. ఈ గ్రామం భూమికి 3,200 మీటర్ల ఎత్తులో, మేఘాలు ఉండే ప్రదేశం కంటే ఎత్తులో ఒక కొండపై ఉంది. అందుకే ఈ గ్రామంలో వర్షాలు పడవు.
ప్రత్యేకమైన వాతావరణం..ఈ గ్రామంలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. పగటిపూట ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది, కానీ రాత్రి సమయంలో చలి విపరీతంగా ఉంటుంది. ఈ గ్రామం ఎత్తైన ప్రదేశంలో ఉన్నా కూడా, అక్కడ ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా వాతావరణం ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు ఆ వాతావరణానికి అలవాటుపడ్డారు.

పర్యాటక ఆకర్షణ..వర్షం పడని(No rain) ప్రాంతంగా పేరు రావడంతో ఈ గ్రామం పర్యాటకులకు ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎత్తైన కొండపై నిలబడి, మేఘాల కింద భూమిపై వర్షం కురిసే అద్భుత దృశ్యాలను వీక్షిస్తారు.
ఈ గ్రామంలో అల్ బోహ్రా మరియు ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వారి ప్రాచీన, ఆధునిక కట్టడాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. అల్-హుతైబ్ గ్రామం ప్రకృతిలో ఉన్న వింతలు, విశేషాలకు ఒక అద్భుతమైన ఉదాహరణ.