Prajwal
ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించిన ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) మాజీ ప్రధానికి మనవడు..ఐటీడీపీ ఎంపీగా పనిచేసిన యువనాయకుడు. ఒక నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన (Prajwal ) ఈ వ్యక్తి… తన హోదాను, అధికారాన్ని, పేదవారి నమ్మకాన్ని అతి నీచంగా దుర్వినియోగం చేశాడు. వందలమంది యువతుల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు. చివరకు పనిమనిషిపైన కూడా ప్రతాపం చూపించాడు. ఎంతోమందిని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు. చివరకు ఏ వీడియోలతో అందరినీ బెదిరించాడో.. అవే వీడియోలు అతడిని కటకటాలపాలు చేశాయి.
నిజం చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సెక్స్ స్కాంలలో ఒకటి.సాధారణంగా ఈ స్థాయిలో ఉన్న వారిని శిక్షించడం కష్టమే. కానీ ఈ కేసులో జరిగిందంతా… భయంకరమైన సరికొత్త టెక్నాలజీ ఆధారంగా పెద్దగా హడావుడి లేకుండా, డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే అవకాశం లేకుండా… ప్రజ్వల్ రేవణ్ణను ఫిక్స్ చేసింది ఒక అరుదైన ఫోరెన్సిక్ టెక్నిక్ . అదే జననేంద్రియ విశ్లేషణ లేదా అనాటమికల్ కంపారెజన్ (Anatomical Comparison of Genital Features)”
అవును… మీరు వింటున్నది నిజం. అతడు తానేనా? అనేది నిర్ధారించేందుకు వీడియోల్లో కనిపించే అతని జననేంద్రియ ఆకారాన్ని, రంగును, చర్మ నిర్మాణాన్ని స్పెషల్ టూల్స్‌తో స్కాన్ చేసి, దాన్ని అతని ఒరిజినల్ ఫిజికల్ స్ట్రక్చర్‌తో మ్యాచ్ చేశారు. ప్రతీ ఫ్రేమ్‌ను పరిశీలిస్తూ, అతనిని తప్పకుండా గుర్తించేలా నిపుణులు నెలల తరబడి అన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆధారాలను స్టడీ చేశారు. ఈ టెక్నిక్ వల్లే… ప్రజ్వల్ (Prajwal ) తప్పించుకునే ఛాన్స్ అస్సలు లేకుండా పోయింది.
ఈ అనాటమికల్ కంపారెజన్ టర్కీ, జపాన్ పోలీసులు ఇప్పటికే అనేక కేసుల్లో నేరస్థులను గుర్తించి శిక్షింపజేశారు. అయితే మన దేశంలో మాత్రం ఇలాంటి సాంకేతికత ఇప్పటి వరకూ ఉపయోగించలేదు. ఎప్పుడైతే ప్రజ్వల్ రేవణ్ణ కేసులో హైరెజ్ వీడియోల ఆధారంగా అతని జననేంద్రియాల యూనిక్ ఫీచర్లను ఫ్రేమ్ బై ఫ్రేమ్‌గా విశ్లేషించారో.. అప్పుడే అతని నేరం నిర్ధారణకు ఇది కీలక ఆధారంగా మారింది.
ఈ ప్రక్రియలో స్క్రీన్‌షాట్‌లు, వీడియో క్లిప్స్, ఫొరెన్సిక్ శాస్త్రజ్ఞుల నివేదికలు(advanced forensic technology), ఆర్థోపెడిక్ నిపుణుల విశ్లేషణ, చర్మ నిపుణుల సలహాలు అన్నీ ఒకేసారి పరిశీలించబడ్డాయి. నిపుణులు దీన్ని వేలిముద్రలతో పోల్చుతూ,మరింత కచ్చితంగా తెలుసుకున్నారు. ఇది ఒక రకంగా శరీరంలోని పర్మినెంట్ లక్షణాలు ఆధారంగా వ్యక్తిని గుర్తించడమే కాని, అది అత్యంత ప్రైవేట్ అంశాల విశ్లేషణతో కూడింది కావడం వల్ల కేసు విచారణను మరింత టఫ్‌గా మారింది. .
ఈ టెక్నిక్‌కు ముందు ఆరోపణలు ఎంత కష్టంగానూ… కానీ వాటిని రుజువు చేయడానికి బలమైన ఆధారాల కోసం సిట్ అధికారులు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించింది. 2,960 వీడియో క్లిప్స్‌లో ప్రజ్వల్ కనిపించాడన్న అనుమానాల్ని.. నిజంగా అతడే నేరస్థుడని స్పష్టంగా నిరూపించింది ఈ కొత్త టెక్నాలజీనే.
అతడు తీసిన 2960 వీడియోల్లో ఒక్కటే కాదు.. ప్రతీ ఒక్కదీ, దాన్ని అడ్డుపెట్టుకుని యువతుల్ని బెదిరించిన దాన్ని… ఇప్పుడు కోర్టులో అతడికే శాపంగా మారింది. “అతడే చేశాడని న్యాయవ్యవస్థ దృఢంగా ప్రకటించింది.
ఈ కేసు తీర్పుతో రెండు విషయాలు దేశానికి స్పష్టమయ్యాయి. ఒకటి సాంకేతికంగా నేరం చేసి తప్పించుకునే రోజులే లేవు. రెండోది రాజకీయ బలంతో తప్పించుకునే రోజులు పోయాయి.
Also Read: Kavitha: కవిత వెనుక నిజంగానే కోవర్టులున్నారా?