Kavitha: కవిత వెనుక నిజంగానే కోవర్టులున్నారా?
Kavitha: జగదీష్ రెడ్డిని కవిత ఎందుకు టార్గెట్ చేశారు?

Kavitha
తెలంగాణ రాజకీయ రంగంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలతో.. బీఆర్ఎస్ లో కోవర్టుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలతో పార్టీ శిబిరంలో రేగిన రాజకీయం పీక్స్‌కు చేరింది. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తనపై బలమైన కుట్ర జరుగుతోందని, ఇందులో పార్టీకి చెందినే ఒక ముఖ్య నేత ప్రధాన పాత్రధారిగా ఉన్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేరు చెప్పి మరీ కవిత బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారాన్నే రేపుతుంది.
లిల్లీ పుట్ నాయకుడు నా గురించి కామెంట్స్ చేస్తాడా అని కవిత ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్( brs) పార్టీ ని నాశనం చేశాడని అన్న కవిత చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఏదో గెలిచాడంటూ ఘాటు కామెంట్లు చేశారు. జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనే అంటూ ఇతర చర్చలకు తావు లేకుండా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు.
నల్లగొండలో పార్టీని నేనే నాశనం చేశానా..? అసలే ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచిన వాడి నోరు ఆగటం లేదు. నన్నే విమర్శిస్తున్నాడు. జిల్లాలో అన్ని సీట్లు ఎందుకు ఓడిపోయాయో అందరికీ తెలుసు. అంటూ నిప్పులు చెరిగే మాటలతో విరుచుకుపడ్డారు కవిత. జగదీష్ రెడ్డిని పేరు చెబుతూ ఈ స్థాయిలో సూటిగా వ్యాఖ్యానించింది మాత్రం ఇదే మొదటిసారి.
మొత్తంగా కవిత (Kavitha)పై జరిగిన హ్యాష్‌ట్యాగ్ దాడులనుండి మొదలుపెట్టిన ఈ దుమారం… ఇప్పుడు జాగృతిలో కోవర్టుల వ్యవహారానికి చేరుకుంది. మా సంస్థలో ఎవరెవరో సమాచారం లీక్ చేస్తున్నారు. వారిని ఎవరో నియమించారు. కానీ వారికి నాకు దిమ్మతిరిగే సమాచారం ఉంది. నేను కూడా మీ క్యాంప్ లో మనుషుల్ని ఉంచాను..” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు.. నేరుగా ఎవరి దిశగా ఉన్నాయో బీఆర్ఎస్ వర్గాలంతా చర్చించుకుంటున్నాయి.

ఇక్కడే అసలైన పాయింట్ మొదలవుతుంది. పార్టీలో ఇంత గందరగోళం జరుగుతున్నా కవిత (Kavitha) ఒంటరిగా పోరాడుతున్నా.. కేసీఆర్ మౌనం ఎందుకు? మొత్తంగా కేటీఆర్ నిరాసక్తత, హరీష్ రావు పొలిటికల్ డిస్టెన్స్ ఇవన్నీ కలిపితే… పార్టీలో కవిత ఒంటరిగా బరిలో ఉన్నట్లే కనిపిస్తోంది. జాగృతి మాధ్యమంగా సామాజిక వర్గాల్లో తన పిలుపును విస్తరించే ప్రయత్నం చేసిన కవితను, పార్టీ నుంచి దూరం చేసే ప్లాన్ ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
అంతర్గతంగా BRS పార్టీ నేతల మధ్య కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలి, పాత నాయకుల ఓవరాక్టింగ్ తగ్గాలి అన్న వాదనల మధ్య కవిత లైమ్లైట్‌కు రావడమే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత పార్టీలోని మేజర్ డెసిషన్లు ఒకదిశగా వెళ్లడం వల్ల కవిత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ డైరెక్ట్ ప్రశ్న తలెత్తుతోంది – గారాలపట్టి కూతురికి పార్టీ దూరమవుతోందా..? కేసీఆర్ మౌనం వెనుక ఏదైనా వ్యూహమా..? లేకపోతే ఇది కుటుంబంలోనే ఓ శక్తుల పోరు మొదలైందని సంకేతమా..? ఇంతకీ… జాగృతిలో ఉన్న వారు నిజంగా కోవర్టులా..? లేక పార్టీ నుంచి బలంగా ముందుకు రావాలన్న కవిత వ్యూహమా..? బీఆర్ఎస్‌లో అసలు ఏం జరుగుతోంది?
Also read: Kondasurekha : పదునెక్కిన పరువు దావా..
One Comment