Hamas
ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా ఉన్న హమాస్ (Hamas)ఇప్పుడు భారత్‌కు కూడా ప్రమాదకరంగా మారింది. పాకిస్తానీ ఉగ్రముఠా లష్కరే తోయిబాతో చేతులు కలిపి ఇండియాపై దాడులకు కుట్రలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి స్నేహితునిగా ఉన్న ఇజ్రాయిల్ కూడా ఈ అనుమానాలను నిజమనే పేర్కొంటోంది. హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించడానికీ ఇది సరైన సమయంప్రమాదం పొంచి ఉంది.
హమాస్(Hamas)-లష్కరే తోయిబా మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చామనీ, భారత్ కూడా హమాస్‌ను తీవ్రవాదసంస్థగా ప్రకటించాలని కోరింది. మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్రప్రభావం చూపనుంది.
నిజానికి భారత విదేశాంగ విధానంలో హమాస్, హిజ్బుల్లా సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించలేదు. దీనికి కారణాలను చూస్తే హమాస్, హిజ్బుల్లా భారత్‌కు ప్రత్యక్షంగా హాని కలిగించలేదు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా వంటివి భారత్ పై దాడులకు తెగబడ్డాయి. దీంతో వాటినే ఇప్పటి వరకూ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు.
గతంలో పాలస్తీనా ఎన్నికల్లో హమాస్(Hamas) కూడా పాల్గొనడంతో దానిని పరిపాలనలో భాగంగా భావించారు. అలాగే పాలస్తీనియన్లు హమాస్‌ను ఎన్నుకున్నారు,ఈ కారణాలతోనే హమాస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు అర్థముతోందిపైగా ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారత్ టూ స్టేట్ విధానాన్ని ఫాలో అవుతోంది.
మరోవైపు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలనే ఇజ్రాయెల్ డిమాండ్‌కు పలు కారణాలున్నాయి. ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే.. ఆ సంస్థ ఆర్థిక వనరులను పూర్తిగా తనిఖీ చేస్తారు.ఆ సంస్థ పరిచయాలు, సంబంధాలపై నిఘా ఉంచుతారు. వారి లక్ష్యాలను ఏ దేశాలు సమర్థిస్తున్నాయి? ఏ దేశాలు వ్యతిరేకిస్తున్నాయో పర్యవేక్షిస్తారు.
ఫలితంగా మరోసారి ఉగ్ర దాడులు జరగకుండా ఉండేలా వారిపై నిఘా ఉంచడానికి వీలవతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు గుర్తిస్తే హమాస్(Hamas)పై ఒత్తిడి పెరుగుతుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. 1987లో హమాస్ గ్రూపును స్థాపించారు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు దానిని తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి.
ఇప్పుడు భారత్ కూడా దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే అంతర్జాతీయంగా గట్టి మెసేజ్ వెళ్ళినట్టేనని ఇజ్రాయెల్ తెలిపింది. తద్వారా హమాస్ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడం మాత్రమే కాకుండా, ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేసే కీలక చర్యగా ఉంటుందని భావిస్తున్నారు.
