Operation Sindoor 2.0: వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేస్తాం పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Operation Sindoor 2.0: త్వరలోనే ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 రావొచ్చేమో.. మీరు సిద్ధంగా ఉండాలంటూ ద్వివేది సైనికులకు సంకేతాలిచ్చారు.

Operation Sindoor 2.0

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని భారత్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ రుజువు చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి దిమ్మితిరిగేలా చేసింది. పైకి ఏం జరగలేదంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాక్ ఆర్మీ లోలోపల మాత్రం వణుకుతోంది. కానీ తన కుక్క తోక వంకర బుద్ధిని మార్చోకోని దాయాది దేశం సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.

ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించం ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము అనుకుంటే పాక్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని తేల్చేశారు. రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌ ఆర్మీ పోస్టులో ఉన్న సైనికులను ఉద్దేశించి ద్వివేది మాట్లాడారు. పాకిస్తాన్ తన ఉనికిని నిలుపుకోవాలంటే ఉగ్రవాదులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయమివ్వడం మానుకోవాలని చెప్పారు.

Operation Sindoor 2.0

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందనీ, కానీ తమ జోలికి వస్తే మాత్రం తాటతీస్తామన్నారు. అవసరమైతే ఆపరేషన్ సింధూన్ 2.0(Operation Sindoor 2.0) ను ప్రకటించేందుకు కూడా వెనుకాడమని పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి సంయమనం పాటించేది కూడా లేదని ద్వివేది స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిందా లేదా అనేది ప్రపంచం మొత్తానికి తెలుసనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ప్రపంచపటంలో మీ దేశాన్ని చూడాలనుకుంటే ఇకపై టెర్రరిస్టులకు చేయూతనివ్వడం ఆపాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులు చూపించిన తెగువను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుందన్నారు.

Operation Sindoor 2.0

త్వరలోనే ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 (Operation Sindoor 2.0)రావొచ్చేమో.. మీరు సిద్ధంగా ఉండాలంటూ ద్వివేది సైనికులకు సంకేతాలిచ్చారు. ఇదిలా ఉంటే ఆర్మీ చీఫ్ ద్వివేది మాట్లాడడానికి ముందు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ వైమానిక దళాలు కూల్చేసిన పాక్ యుద్ధ విమానాల వివరాలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. ఎఫ్-16, జేఎఫ్-17 సహా ఐదు పాకిస్థానీ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలిపారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పహల్గాం ఉగ్రదాడిలో భారత పౌరులను దారుణంగా చంపిన పాక్ ఉగ్రవాదులకు భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తో గట్టిగా బుద్ధి చెప్పింది. అత్యాధునిక బ్రహ్మోస్ మిస్సైల్స్ తో పాక్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. భారత్ దెబ్బకు పాక్ ఆర్మీ అధికారులు, ఇతర ముఖ్యనేతలు పారిపోయారు. ఈ విధ్వంసంతో పాక్ ఆర్మీ భారత్ కాళ్ళను పట్టుకుని కాల్పుల విరమించాలంటూ ప్రాధేయపడింది. ఫలితంగా ఆపరేషన్ సింధూర్ ను భారత్ ఆపేసింది. అయితే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటూ సరిహద్దుల్లో మళ్ళీ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఈ కారణంగానే భారత ఆర్మీ చీఫ్ పాక్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version