Bull calf: 28వ అంతస్తులో ఓ బుల్లి దూడ కథ..మీరూ వింటారా

Bull calf:ప్రశాంతత, ప్రేమ, ఇంట్లో ఉన్న మరో ప్రాణి అయిన కుక్కతో కూడా నిస్వార్థంగా చేస్తున్న స్నేహం అందరినీ కట్టిపడేస్తున్నాయి.

Bull calf

సాధారణంగా ఒక జంతు ప్రేమికుల ఇల్లు ఎలా ఉంటుంది? అక్కడ కుక్కలు, పిల్లులు, చిలకలు లేదా కుందేళ్లు ఉండొచ్చు. కానీ చెన్నైలోని 28వ అంతస్తు అపార్ట్‌మెంట్‌లోని ఆ ఇంటిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో వేలాది మంది హృదయాలను హత్తుకున్న ఒక బుల్లి దూడ ఉంది. కుక్కతో పాటు, బుల్లి దూడ ఆ ఇంట్లో ఉండటానికి కారణం ఏమిటి? ఇది కేవలం ఒక అరుదైన సంఘటన కాదు, మానవత్వం సరిహద్దులను ప్రశ్నించే ఒక హృద్యమైన కథ.

ఇది చెప్పుకోవాలంటే కొన్ని నెలల వెనక్కి వెళ్లాలి. రాత్రి పూట, నగరపు అరుపుల మధ్య, ఒక చిన్న దూడ (Bull calf)రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలతో అపాయంలో పడి ఉంది. ఆపదలో ఉన్న ఆ ప్రాణిని గమనించిన జంతు ప్రేమికురాలు, ఆర్కిటెక్ట్ తేజస్విని(Animal activist), ఆలోచించకుండా ఆ దూడను తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పుడు ఆమె మనసులో ఒకటే ఆలోచన ఒకటే ఎలా అయినా ఈ బుల్లి ప్రాణాన్ని కాపాడాలి అని. చిన్న దూడ కాబట్టి, దానిని కొన్ని రోజులు చూసుకుని, ఆ తర్వాత వేరే చోటుకి పంపించవచ్చని ఆమె అనుకుంది. కానీ, మిస్టర్ అలెక్స్ అనే ఆ బుల్లి దూడ (Bull calf) ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది.

Eating disorders:ఈటింగ్ డిజార్డర్స్.. శరీరానికి, మనసుకు జరిగే హానికరమైన పోరాటం గురించి తెలుసా ?

Bull calf

మిస్టర్ అలెక్స్ కేవలం ఒక జంతువు కాదు. అతను ఒక అనుభవం. కళ్ల చూపు లేని ఆ దూడ(Bull calf).. చూపు ఉన్న ఎందరికో జీవితాన్ని ఎలా చూడాలో నేర్పిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనంలో, సముద్రం పక్కన నిలబడి ఆ గాలిని, ఆ శబ్దాన్ని అనుభవిస్తుంది. ప్రశాంతత, ప్రేమ, ఇంట్లో ఉన్న మరో ప్రాణి అయిన కుక్కతో కూడా నిస్వార్థంగా చేస్తున్న స్నేహం అందరినీ కట్టిపడేస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఒక జంతువును ఇంటికి తీసుకురావడానికి దాని జాతి, దాని పరిమాణం, దాని సామర్థ్యాలు అవసరం లేదని తేజస్విని అర్థం చేసుకుంది. అవసరం ఉన్నది కేవలం ప్రేమ, కరుణ మాత్రమేనని ఆమె ప్రపంచానికి నిరూపించింది.

ఈ కథ వైరల్ అయినప్పుడు, ప్రజలు అనేక ప్రశ్నలు అడిగారు. అంత పెద్ద జంతువుతో ఎలా ఉండగలుగుతారు?”, “ఇదేమిటి ఇలా?”, అని. కానీ దీనికి జవాబు చాలా సులభం. ఎందుకంటే ప్రేమకు ఎలాంటి నిర్వచనం ఉండదు. ఎందుకంటే, ఆ ఇంట్లో అంతులేని ప్రేమ ఉంది. మిస్టర్ అలెక్స్ కేవలం ఒక పెంపుడు జంతువు కాదు. ఒక పాఠం, ఒక గుర్తు. ఈ కథనం, ప్రేమకు, మానవత్వానికి ఎటువంటి హద్దులు ఉండవని, కొన్నిసార్లు అత్యంత అద్భుతమైన స్నేహాలు చాలా అసాధారణమైన సందర్భాల్లోనే పుడతాయని మనకు గుర్తు చేస్తుంది.

Exit mobile version