Anjaneya: మీరు తప్పక చూడాల్సిన 11 శక్తివంతమైన ఆంజనేయ ఆలయాలు

Anjaneya: భారతదేశంలో భక్తిని శక్తిగా మలిచిన దేవుడు ఆంజనేయుడు. రాముని సేవకుడిగా మాత్రమే కాకుండా, ధైర్యం, బలము, భక్తి సంకేతంగా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు.

Anjaneya

భారతదేశంలో భక్తిని శక్తిగా మలిచిన దేవుడు ఆంజనేయుడు(Anjaneya). రాముని సేవకుడిగా మాత్రమే కాకుండా, ధైర్యం, బలము, భక్తి సంకేతంగా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆంజనేయుడికి అంకితంగా ఉన్న ఆలయాలు వేలలో ఉన్నా, కొన్ని ఆలయాలు మాత్రమే భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వాటిలో 11 ఆలయాల గురించి తెలుసుకోండి:

1. యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం – హంపీ, కర్ణాటక

కర్ణాటకలోని హంపీ వద్ద ఉన్న యంత్రోద్ధారక హనుమంతుడు (Anjaneya) .ఓ చారిత్రక పుణ్యక్షేత్రంగా నిలుస్తాడు. పద్మాసనంలో కూర్చున్న విగ్రహాన్ని వ్యాసరాయులు ప్రతిష్ఠించారన్న విశ్వాసం అక్కడ భక్తి కురిపిస్తుంది. అదే విధంగా, అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయం, రాముడిని రక్షించేందుకు ఆంజనేయుడు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాడన్న నమ్మకంతో భక్తుల గుండెల్లో భయం పోగొట్టే క్షేత్రంగా మారింది.

2. హనుమాన్ గఢీ – అయోధ్య, ఉత్తర ప్రదేశ్

అయోధ్యను రక్షించే దేవుడిగా హనుమంతుడు పూజించబడే ఆలయం. 76 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం లభిస్తుంది. కోరికల నెరవేర్పునకు ప్రసిద్ధి.

3. నమక్కల్ ఆంజనేయర్ ఆలయం – తమిళనాడు

తమిళనాడులోని నమక్కల్ హనుమంతుడు, 18 అడుగుల ఎత్తుతో నమస్సు చేస్తున్న శైలిలో దర్శనమిస్తాడు. ఇది వినయానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది. వారణాసిలోని సంకటమోచన్ ఆలయం తులసీదాస్ స్థాపించిన ఘనత కలిగి ఉంది. ఇక్కడ హనుమాన్ చాలీసా పఠనం ఎవరినైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Anjaneya

4. సంకట మోచన్ ఆలయం – వారణాసి, ఉత్తర ప్రదేశ్

5. బేడి హనుమాన్ – పురీ జగన్నాథ ఆలయం, ఒడిశా
చిన్నలపట్టిలోని అంజలి వరద హనుమంతుడు, అంజలి ముద్రలో ఉండి భక్తుల కోరికలు ఆలకిస్తున్నట్టు అనిపిస్తాడు. ఒడిశాలోని పురీలో బేడి హనుమంతుడికి ఉన్న కథ భక్తులను ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఆయన చేతులకు బంధనాలు ఉండటాన్ని శ్రీమహావిష్ణువు సముద్రంపై శాంతిని నిలుపుదల చేయటానికి ఏర్పాటుగా భావిస్తారు.

6.అంజలి వరద ఆంజనేయ ఆలయం – చిన్నలపట్టి, తమిళనాడు

ఇక్కడ హనుమంతుడు అంజలి ముద్రలో కనిపిస్తాడు. తను వినిపిస్తున్నట్టు, చూసే ప్రతి ఒక్కరిలో ఒక ప్రశాంతత నింపే శక్తి ఈ ఆలయంలో ఉంది.
అంజలితో ప్రార్థించిన వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

7. సుచీంద్రం థనుమాలయన్ ఆలయం – తమిళనాడు

తమిళనాడులోని సుచీంద్రం హనుమంతుడి విగ్రహం కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. 22 అడుగుల విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే విస్మయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పరిటాలలోని హనుమంతుడు అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ప్రసిద్ధి పొందాడు – 176 అడుగుల హైటుతో భక్తులకు నమ్మకానికి మారుపేరు అయిపోయాడు.

8. పరిటాల ఆంజనేయ ఆలయం – ఆంధ్రప్రదేశ్

ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హనుమంత ఆలయాలలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంత విగ్రహం – 176 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం ఆకాశాన్ని తాకుతుంది. చూసిన ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుతుంది.

9. బడే హనుమాన్ ఆలయం – ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్

ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ ఆలయం భిన్నతకు మారు పేరు. ఇక్కడి ఆంజనేయుడు నేలపై పడుకొని ఉండటం, గంగానదిలో కొన్నిసార్లు మునిగిపోవడం భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. షిమ్లాలోని జఖూ ఆలయం మంచుతో కప్పబడిన కొండలలో ఉండి, సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లే సమయంలో ఆంజనేయుడు విశ్రాంతి తీసుకున్న స్థలంగా పిలుస్తారు.

Anjaneya

10. జఖూ ఆలయం – షిమ్లా, హిమాచల్ ప్రదేశ్

సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో 108 అడుగుల విగ్రహం. సంజీవని పర్వతం తెచ్చే దారిలో హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న చోటుగా ప్రఖ్యాతి.

11. అంజనాద్రి కొండ – హంపీ, కర్ణాటక

తిరిగి హంపీలోని అంజనాద్రి కొండ మీదకు వస్తే – ఇది ఆంజనేయుని జన్మస్థలమని నమ్మకం. 575 మెట్లు ఎక్కి చేరాల్సిన ఈ ఆలయంలో బాల హనుమంతుడు దర్శనం భక్తుల్లో మాతృస్ఫూర్తిని కలిగిస్తుంది.

ఆలయాల్లో ప్రతిదానికీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి భక్తి, ధైర్యం, విశ్వాసం అనే మూలాలను భగ్నం చేయకుండా నిలుపుతున్న పవిత్ర స్థలాలు. మీరు ఒక భక్తి యాత్రకు సిద్ధమైతే – ఈ ఆలయాల దర్శనంతో మీ జీవితానికే ఓ కొత్త ఉత్సాహం లభించవచ్చు.

 

Exit mobile version