Tarpanam:అమావాస్య తర్పణ నియమాలు.. పితృ దేవతలు వేరే జన్మ ఎత్తితే వారికి తర్పణం అందుతుందా?
Tarpanam : మరణించిన మన పూర్వీకులకు చేసే పితృ కార్యాలలో కేవలం ఆచారాలు మాత్రమే కావు, అవి ఒక లోతైన ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉంటుంది
Tarpanam
సనాతన ధర్మంలో పితృ కార్యాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరణించిన మన పూర్వీకులకు చేసే పితృ కార్యాలలో కేవలం ఆచారాలు మాత్రమే కావు, అవి ఒక లోతైన ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉంటుంది. అమావాస్య రోజు పితృ దేవతలు భూలోకానికి వస్తారని, వారు తమ వంశీయుల నుంచి కొద్దిపాటి జలం, నువ్వులను ఆశిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి.
పితృ దేవతలు ఏ జన్మలో ఉన్నా తర్పణాలు అందుతాయా అని చాలామందికి సందేహం వస్తుంది. మా పితృ దేవతలు ఇప్పటికే మరో జన్మ ఎత్తి ఉంటే, తాము ఇచ్చే తర్పణాలు వారికి ఎలా అందుతాయనే అనుమానం వస్తుంది. దీనికి మత్స్య పురాణం అద్భుతమైన సమాధానం ఇచ్చింది. మనం ఇచ్చే తర్పణం(Tarpanam) మన పితృ దేవతలు ఏ రూపంలో ఉన్నా సరే, వారికి అనువైన ఆహారంగా మారి అందుతుందట.
ఉదాహరణకు, వారు దేవతలుగా ఉంటే అమృతం రూపంలో, పశువులుగా ఉంటే గడ్డి రూపంలో,ఒకవేళ మనుషులుగా ఉంటే అన్నం రూపంలో ఆ శక్తి వారికి చేరుతుందని.. మనం చెప్పే నామ గోత్రాలు ఆ తర్పణానికి ఒక అడ్రస్ (Address) లా పని చేస్తాయి. వందల ఆవుల మందలో దూడ తన తల్లిని ఎలా వెతుక్కుంటూ వెళ్తుందో, మనం ఇచ్చే తర్పణం(Tarpanam) కూడా మన పూర్వీకులను అలా వెతుక్కుంటూ వెళ్తుందని మత్స్య శాస్త్రం చెబుతుంది.

అమావాస్య తర్పణ నియమాలు ఎలా ఉండాలి అంటే..తర్పణాన్ని ఎప్పుడూ దక్షిణ ముఖంగా ఉండి ఇవ్వాలి. మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 మధ్య సమయం అంటే కుతప కాలం దీనికి అత్యంత శ్రేష్ఠంగా చెబుతారు. నల్ల నువ్వులను వాడటం వల్ల అవి రాక్షస శక్తులను దరిచేరనీయకుండా పితృ దేవతలకు ఆహారాన్ని సురక్షితంగా అందజేస్తాయని పండితులు చెబుతారు. యజ్ఞోపవీతం ఉన్నవారు ప్రాచీనావీతిగా వేసుకోవాలి.
రుణం తీర్చుకోలేకపోతే ఏం చేయాలి?.. ఒకవేళ మీరు తర్పణం ఇచ్చే స్థితిలో లేకపోతే, అమావాస్య రోజు ఆవుకు గ్రాసం తినిపించడం లేదా ఒక పేదవాడికి అన్నదానం చేయడం వల్ల కూడా పితృ దేవతలు తృప్తి చెందుతారట. ఏమీ చేయలేని పక్షంలో, ఆకాశం వైపు చేతులెత్తి మనస్ఫూర్తిగా వారిని స్మరించుకున్నా కూడా అది వారికి అమృతంలా అందుతుంది. పితృ దేవతలు తృప్తి చెందితే ఆ వంశానికి ఆయుష్షు, ఆరోగ్యం, ధనం లభిస్తాయని ఆధ్యాత్మిక కథనాలు వివరిస్తున్నాయి.
Ratha Saptami:రథసప్తమి విశిష్టత ..స్నానం చేసే పద్ధతి..పూజ ఎలా చేయాలో తెలుసా?



