Tulsi :తులసి మొక్క వద్ద ఈ తప్పులు చేస్తున్నారా?

Tulsi :తులసి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాణాలు సూచిస్తున్నాయి.

Tulsi

హిందూ సంప్రదాయంలో తులసి (Tulsi) మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందుకే ప్రతి ఇంట్లో తులసి కోట ఉండటం శుభప్రదం అని అనుకుంటాం.

అయితే, తులసిని పూజించే సమయంలో కానీ, లేదా ఆ మొక్కను పెంచే విషయంలో మనం తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు, అశాంతికి దారితీస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తులసి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాయి.

ముఖ్యంగా ఆదివారం రోజు తులసి(Tulsi) మొక్కకు నీళ్లు పోయకూడదని అలాగే ఆరోజు ఆకులు కోయకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఆదివారం తులసి దేవి విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని, ఆ రోజు ఆమెను ఇబ్బంది పెట్టకూడదని పెద్దలు అంటారు.

Tulsi

అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తుంచడం కూడా మహా పాపంగా భావిస్తారు.

తులసి మొక్క ఎండిపోయినా లేదా నిదురపోయినా వెంటనే దానిని తీసివేసి కొత్త మొక్కను నాటాలి. ఎండిన తులసి మొక్క మన ఇంట్లో ఉండటం ప్రతికూల శక్తిని (Negative Energy) పెంచుతుంది.

తులసి కోటను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. మొక్క చుట్టూ మురికి ఉండటం, చెప్పులు విడవడం వంటివి అస్సలు చేయకూడదు.

తులసి చెంత సాయంత్రం వేళ నేతి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. గణేశుని పూజలో.. తులసి ఆకులను వాడకూడదనే నియమాన్నికూడా కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ తులసిని పూజిస్తే, ఆ ఇంట్లో సుఖశాంతులకు కొదవ ఉండదు.

Movies :సంక్రాంతికి స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సినిమాలు..ఓటీటీ సందడికి రెడీ

 

Exit mobile version