Movies :సంక్రాంతికి స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సినిమాలు..ఓటీటీ సందడికి రెడీ
Movies: బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ నటించిన 'దే దే ప్యార్ దే 2' కూడా ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది.
Movies
సంక్రాంతి పండుగ అంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వద్ద కూడా సందడి కూడా అదే రేంజ్‌లో ఉంటుంది . దీనికి తగినట్లుగానే పండుగ సెలవుల్లో ఇంట్లోనే కూర్చుని కొత్త మూవీలు(Movies ) చూడాలనుకునే వారి కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు అదిరిపోయే మూవీలను రెడీ చేశాయి.
ఈ వారం డిజిటల్ స్క్రీన్స్ పై మెరవబోతున్న కొన్ని ముఖ్యమైన సినిమాల(Movies )లో ముందుగా నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ అఖండ 2: తాండవం. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న నెట్‌ప్లిక్స్, సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. థియేటర్లలో శివతాండవం ఆడిన ఈ సినిమా, ఓటీటీలో కూడా రికార్డులు తిరగరాయడం ఖాయం అని బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హోమ్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి.

మరోవైపు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ నటించిన ‘దే దే ప్యార్ దే 2’ కూడా ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ చూడటానికి ఇది సరైన ఎంపిక.
వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా క్యూలో ఉన్నాయి. ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్ అయిన కొన్ని క్రైమ్ థ్రిల్లర్లు తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం ఓటీటీలో కంటెంట్ చూస్తుంటే, ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశమే లేదని సినీ ప్రియులు చెబుతున్నారు. అయితే అధికారిక స్ట్రీమింగ్ డేట్లపై ఆయా సంస్థలు మరికొద్ది గంటల్లోనే క్లారిటీ ఇవ్వనున్నాయి.
Prabhas:తమిళనాడులో ప్రభాస్ సెన్సేషన్.. విజయ్ వెనకడుగు డార్లింగ్‌కు ప్లస్ అయిందా?




2 Comments