Karma
కర్మ (Karma) పునర్జన్మ , సిద్ధాంతాలు హిందూ, బౌద్ధ , జైన ధర్మాల యొక్క మూల స్తంభాలుగా చెబుతారు పండితులు. ఈ రెండు భావనలు మానవ జీవితానికి మ, విశ్వానికి ఒక నైతిక, కారణ-కార్య (Cause-and-Effect) చట్రాన్ని అందిస్తాయి. కర్మ అంటే ‘చర్య’ లేదా ‘పని’. ప్రతి ఆలోచన, మాట ,శారీరక చర్య ఒక శక్తిని (Energy) సృష్టిస్తుందని శాస్త్రాలు వివరిస్తాయి..
ఇది మన భవిష్యత్తుపై ప్రభావం చూపే ఒక ‘కర్మ ఫలాన్ని’ (Consequence) తిరిగి మనకు అందిస్తుంది. ఈ కర్మ ఫలం వెంటనే కాక, ప్రస్తుత జీవితంలో లేదా రాబోయే పునర్జన్మలలో అనుభవించబడుతుందని శాస్త్రాలు చెబుతాయి. ఈ సిద్ధాంతం మనిషికి స్వేచ్ఛా సంకల్పాన్ని (Free Will) ప్రసాదిస్తుంది.
మన చర్యలను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది, కానీ ఆ చర్యల ఫలితాలను అనుభవించాల్సిన బాధ్యత మనదే. కర్మను మూడు ప్రధాన రకాలుగా విభజిస్తారు:
1. సంచిత కర్మ.. పూర్వ జన్మల్లో పేరుకుపోయి, ఇంకా ఫలించని కర్మల మొత్తం నిల్వ.
2. ప్రారబ్ధ కర్మ: సంచిత కర్మ నుంచి ఈ జీవితంలో అనుభవించడానికి ఎంచుకున్న భాగం (మన విధి లేదా డెస్టినీ).
3. క్రియమాణ కర్మ: ప్రస్తుత జీవితంలో మనం నిరంతరం సృష్టిస్తున్న కొత్త కర్మలు, దీని ఫలితం భవిష్యత్తులో ఉంటుంది.
ఈ కర్మల యొక్క ఫలాలను అనుభవించేందుకు, ఆత్మ నిరంతరం జననం, మరణం , పునఃజననం (పునర్జన్మ) అనే సంసార చక్రాన్ని కొనసాగిస్తుంది.
ఈ చక్రం నుంచి విముక్తి పొందడమే మోక్షం (విముక్తి లేదా తుది విలీనం). కర్మ సిద్ధాంతం అనేది జీవితంలో ధర్మం (Righteousness), నిస్వార్థత, కరుణతో కూడిన చర్యలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక లోతైన నైతిక దర్శనం (Moral Philosophyగా పండితులు భావిస్తారు.
