Temple గుడికి వెళ్లకపోయినా పుణ్యం వస్తుందా? పురాణాలు మనకు చెప్పని నిజం?

Temple ఒక మనిషి రోజూ గుడికి వెళ్లి బయటకు వచ్చాక కోపంగా మాట్లాడితే, మోసం చేస్తే, ఇతరులను చిన్నచూపు చూస్తే..అతని గుడి ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది.

Temple

చాలామంది మనసులో ఉండే ప్రశ్న ఇది. నేను గుడికి ఎక్కువగా వెళ్లను.. అలా అయితే నాకు పుణ్యం రాదా? అసలు నిజం ఏంటి? పురాణాలు ఒక మాట చాలా క్లియర్‌గా చెబుతాయి. పుణ్యం అనేది నడకలో ఉంటుంది, నోటిలో కాదు. అంటే మనం ఎక్కడికి వెళ్లామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం.

గుడి (Temple)అనేది ఒక ప్రదేశం. పుణ్యం అనేది ఒక ప్రక్రియ. పురాణాల్లో చాలా కథల్లో దేవుళ్లు కూడా అడవుల్లో, ఇళ్లల్లో, మనుషుల మధ్యే కనిపిస్తారు. వాళ్లను చేరుకున్నవాళ్లు అందరూ రోజూ గుడికి వెళ్లినవాళ్లే కాదు. నిజాయితీగా ప్రవర్తించినవాళ్లు, కష్టంలో ఉన్నవాళ్లకు సహాయం చేసినవాళ్లే. సైకాలజీ కోణంలో చూస్తే కూడా ఇదే నిజం.

గుడి(Temple)కి వెళ్లడం మనకు ఒక పాజిటివ్ మూడ్ (Positive Mood) ఇస్తుంది, శాంతి ఇస్తుంది. కానీ అదే శాంతిని మన రోజువారీ ప్రవర్తనలో నిలబెట్టుకోకపోతే, ఆ ప్రభావం బయటికి రాదు. ఒక మనిషి రోజూ గుడికి వెళ్లి బయటకు వచ్చాక కోపంగా మాట్లాడితే, మోసం చేస్తే, ఇతరులను చిన్నచూపు చూస్తే..అతని గుడి ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది.

Temple

అందుకే పురాణాలు ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడతాయి. ధర్మం అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు కాదు. మన రోజువారీ నిర్ణయాలు సరిగా ఉండటం. ఎవరినైనా అనవసరంగా బాధ పెట్టకపోవడం. మనకు అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయడం. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం. అవసరం లేకుండా అబద్ధం చెప్పకపోవడం. ఇవి అన్నీ పుణ్యానికి అసలు బేస్. గుడికి వెళ్లకపోయినా, మనసు సరిగా ఉంటే పుణ్యం వస్తుంది. కానీ గుడికి వెళ్లి కూడా మనసు విషంగా ఉంటే, పుణ్యం అక్కడే ఆగిపోతుంది.

కొన్ని సార్లు మనం గుడికి వెళ్లలేకపోతాం. పని, పరిస్థితులు, బాధ్యతలు. అప్పుడు నాకు పుణ్యం రావట్లేదు అన్న గిల్ట్ (Guilt) వస్తుంది. ఇది అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి మన టైమ్ షీట్ అవసరం లేదు. మన మనసే ముఖ్యం. పురాణాల్లో ఒక మాట ఉంది..మనసా వాచా కర్మణా.” అంటే మనసులో, మాటలో, పనిలో ఒకే నిజాయితీ ఉండాలి. అది గుడిలో జరిగితే బాగుంది. ఇంట్లో జరిగితే ఇంకా బాగుంది.

బయట సమాజంలో జరిగితే అదే అసలు భక్తి. కాబట్టి గుడికి వెళ్లడం తప్పు కాదు. కానీ గుడి లేకపోయినా మంచిగా బ్రతకడం పెద్ద పుణ్యం. పుణ్యం దేవుడికి దగ్గర చేస్తుంది. కానీ ధర్మం దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version