Kirtana and Bhajan
కీర్తన, భజన (Kirtana and Bhajan)అనేవి హిందూ భక్తి సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన ప్రాక్టీస్ అంటున్నారు నిపుణులు. ఇవి కేవలం భక్తి గీతాలు మాత్రమే కాక, మెదడుపై నాడీ వ్యవస్థపై (Nervous System) లోతైన ప్రభావాన్ని చూపే ఒక రకమైన సామూహిక ధ్యానం (Group Meditation)అని ప్రూవ్ అయిందని చెబుతున్నారు.
ఈ అభ్యాసాలలో, దేవుడి నామాలను లేదా మహిమలను లయబద్ధంగా, పునరావృతంగా (Repetitive Chanting) గానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మనస్సును ఇతర వ్యాకులతలు (Distractions) నుంచి తొలగించి, తాత్కాలికంగా నిశ్శబ్దం (Temporary Silence) చేసే ఒక ముఖ్యమైన పనిని చేస్తుంది. ఇది మెదడును ఆల్ఫా (Alpha) , థీటా (Theta) తరంగ స్థితికి తీసుకువెళుతుంది. ఆల్ఫా తరంగాలు ప్రశాంతమైన ఏకాగ్రతను, థీటా తరంగాలు లోతైన ధ్యాన స్థితిని సూచిస్తాయి.
భజన లేదా కీర్తనలో పాల్గొన్నప్పుడు, శరీరంలో ఒత్తిడిని తగ్గించే , ఆనందాన్ని కలిగించే ఎండార్ఫిన్లు (Endorphins), ఆక్సిటోసిన్ (Oxytocin) వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ రసాయన చర్య ఒత్తిడి హార్మోన్లైన కార్టిసోల్‌ను తగ్గిస్తుంది. కీర్తనల యొక్క లయ, శ్వాస యొక్క లయతో అనుసంధానించబడి, పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (Parasympathetic Nervous System) ఉత్తేజితం చేస్తుంది. ఇది శరీరాన్ని “విశ్రాంతితో పాటు జీర్ణక్రియ” (Rest and Digest) స్థితికి తీసుకువస్తుంది.
అంతేకాకుండా సామూహికంగా పాడటం వల్ల వ్యక్తుల మధ్య సంఘీభావం (Sense of Community), లోతైన అనుబంధం ఏర్పడుతుంది. ఇది సామాజిక ఆరోగ్యానికి , భావోద్వేగ స్థిరత్వానికి చాలా అవసరం. కీర్తన అనేది అహంకారాన్ని (Ego) కరిగించి, హృదయాన్ని దైవ ప్రేమతో నింపడానికి, ఉన్నత చైతన్యాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక చికిత్సా మార్గంగా చెబుతారు నిపుణులు .
