Drusti Bomma:ఇంటి గుమ్మానికి ‘దృష్టి బొమ్మ’..కేవలం నమ్మకమేనా లేక ఏదైనా సైన్స్ ఉందా?

Drusti Bomma: దృష్టి బొమ్మను కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేయలేయమని, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కోణం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

Drusti Bomma

హిందువుల ఇళ్ల ముందు, ముఖ్యంగా కొత్తగా కడుతున్న ఇళ్ల గుమ్మానికి లేదా పైకప్పు మీద దృష్టి బొమ్మ(Drusti Bomma) అంటే నల్లటి రంగులో భయంకరమైన మొఖం కలిగిన బొమ్మ కట్టడం చూస్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకు తరతరాలుగా వస్తున్న ఆచారంగా మారిపోయింది.

దీనిని మనం కేవలం ‘దిష్టి’ తగలకుండా ఉండటానికే అని అంతా అనుకుంటాం. కానీ దీని వెనుక లోతైన వాస్తు సైన్స్, సైకలాజికల్ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దృష్టి బొమ్మను కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేయలేయమని, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కోణం మనల్ని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక కొత్త ఇల్లు లేదా అందమైన కట్టడాన్ని చూసినప్పుడు అది చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అలా చూసేవారిలో అందరూ ఒకే రకమైన ఆలోచనతోనూ, దృష్టితోనూ ఉండరు. కొంతమంది మనసులో కలిగే అసూయ లేదా ప్రతికూల ఆలోచనల (Negative Vibrations)తో ఉంటారు. ఇవి ఆ ఇంటి యజమాని మీద కానీ ఆ కట్టడం మీద కానీ పడే అవకాశం ఉంటుంది. దీనినే మనం ‘కంటి దిష్టి’ అంటూ ఉంటాం.

దీనిని సైన్స్ పరంగా చూస్తే, మనిషి కళ్ల నుంచి వెలువడే తరంగాలు (Light Waves/Energy) ఎదుటి వస్తువుపై బాగా ప్రభావం చూపిస్తాయి. ఆ శక్తిని మళ్లించడానికి లేదా డిఫ్లెక్ట్ చేయడానికి ఈ దృష్టి బొమ్మ ఒక సాధనంగా పనిచేస్తుందట. ఎలా అంటే ఆ భయంకరమైన ఆకారాన్ని చూసినప్పుడు చూసేవారి ఏకాగ్రత దెబ్బతిని, వారి నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ ఇంటికి తగలకుండా ఆ బొమ్మ మీద పడి ఈ ఎనర్జీ విచ్ఛిన్నం అవుతుంది.

Drusti Bomma

అంతేకాదు దీనికి సైకలాజికల్ రీజన్ కూడా ఒకటి ఉంది. మనం ఏదైనా అందమైన వస్తువును,ఇంటిని చూసినప్పుడు మనసులో ఆరాధనతో పాటు ఒక తెలియని అసూయ కూడా కలుగుతుంది. అయితే ఆ అందమైన ఇంటి ముందు ఒక వికృతమైన లేదా భయంకరమైన బొమ్మను చూసినప్పుడు.. మన మనసు ఒక్కసారిగా ఆ ఆకర్షణ నుంచి పక్కకు తప్పుకుంటుంది.దీంతో వారి మనసులో అసూయ భావం తొలిగిపోతుంది. అందుకే పూర్వీకులు ఇలాంటి దృష్టి(దిష్టి) బొమ్మ(Drusti Bomma)లను వికారంగా తయారు చేసేవారు.

వాస్తు ప్రకారం చూస్తే.. ఇంటి నైరుతి లేదా ఆగ్నేయ మూలల్లో ఈ దిష్టి బొమ్మ(Drusti Bomma)లను కట్టడం వల్ల బయటి నుంచి వచ్చే చెడు శక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అంటే ఇవి ఒక రకమైన ‘ఎనర్జీ ఫిల్టర్స్’ లాగా పనిచేస్తాయన్న మాట. కాబట్టి దృష్టి బొమ్మ అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది ఇంటి చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని (Positive Energy) కాపాడటానికి మన పెద్దలు కనిపెట్టిన ఒక అద్భుతమైన మార్గం అనే చెప్పాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version