AI Content : ఏఐ కంటెంట్‌‌కు ఇక చెక్ పడినట్లేనా? ఈ లేబులింగ్ అంటే ఏంటి?

AI Content: ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ప్రతి కంటెంట్‌కు ఇకపై లేబులింగ్ తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

AI Content

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరిగిన తర్వాత టెక్నాలజీ ఎంత యూజ్ అవుతుందో, అంతకంటే ఎక్కువగా డేంజర్‌ జరుగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు,ఫేక్ వార్తలు, అసభ్యకర ఇమేజులు ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అంటే ఫిబ్రవరి 10, 2026న చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ప్రతి కంటెంట్‌(AI Content)కు ఇకపై లేబులింగ్ తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

అసలీ లేబులింగ్ అంటే ఏంటంటే..మనం చూస్తున్న ఒక ఫోటో కానీ వీడియో కానీ నిజమైనదా లేక ఏఐతో సృష్టించిందా అని తెలియజేసే ఒక గుర్తునే ‘లేబులింగ్’ అంటారు. ఎగ్జాంపుల్‌కు, ఒక వీడియో ఏఐతో తయారైతే, దానిపై క్లియర్‌గా క్రియేటెడ్ బై ఏఐ( Created by AI) లేదా ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్ ఉండాలి. ఇది వాటర్ మార్కులాగా ఆ వీడియోలో ఇంటర్నల్‌గా ఉంటుంది. ఎవరైనా దీన్ని తొలగించడానికి , మార్చడానికి కనుక ప్రయత్నిస్తే అది చట్టరీత్యా నేరం అవుతుంది.

టెక్స్ట్ కంటెంట్‌లో కూడా మనిషి కంటికి కనిపించని కొన్నిడిజిటల్ కోడ్స్ కానీ వాటర్‌మార్క్‌లను కానీ చేర్చాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల ఆ కంటెంట్ ఎక్కడ పుట్టింది, ఎవరు రాశారనేది ఈజీగా కనిపెట్టొచ్చు.

కేంద్రం విధించిన కఠిన నియమాలు..

ఏఐ టూల్స్ వాడి తయారు చేసే ఆడియో కానీ వీడియో కానీ, ఫోటో కానీ ఏదైనా సరే.. దానిపై ఇది ఏఐ కంటెంట్ అని క్లియర్‌గా కనిపించేలా ఒక లేబుల్ ఉండాలి.
బి.ఎన్.ఎస్ (BNS), పోక్సో (POCSO) చట్టాల ప్రకారం నిషేధించిన విషయాలను , హానికరమైన కంటెంట్‌‌ను ఏఐ ద్వారా సృష్టించకూడదు. ముఖ్యంగా పిల్లల లైంగిక వేధింపులు, అశ్లీలత, పేలుడు పదార్థాల తయారీ వంటి హానికరమైన ఇన్ఫర్మేషన్‌ను ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు అనుమతించకూడదు.

అలాగే ఆ కంటెంట్‌ను ఎవరు క్రియేట్ చేశారు.. ఏ ప్లాట్‌ఫారమ్ ద్వారా తయారైందనే వివరాలను గుర్తించేలా డిజిటల్ ఐడెంటిఫైయర్లు ఉండాలి.

ఐటీ చట్టం సెక్షన్ 79 ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను కూడా గవర్నమెంట్ నిలిపివేయడమో , కంట్రోల్ చేయడమో చేయొచ్చు.

AI Content

ఈ కొత్త నిబంధనలు ఈనెల ఫిబ్రవరి 20, 2026 నుంచి అమలులోకి రాబోతున్నాయి. దీనివల్ల సోషల్ మీడియాలో వచ్చే డీప్ ఫేక్ వీడియోల భయం తగ్గుతుంది. సామాన్యులు కూడా ఏది నిజమో, ఏది గ్రాఫిక్స్ లేదా ఏఐ మాయో ఈజీగా గుర్తించగలరు.

ఈ నిర్ణయం వల్ల డిజిటల్ ప్రపంచంలో జవాబుదారీతనం పెరుగుతుంది. గూగుల్, మెటా , ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ కంటెంట్‌ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో ఏఐని వాడితే వారిని పట్టుకోవడం ఈజీ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version