T20 World Cup
టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో యూఎస్ఏ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్ లో భారత్ పై ఆకట్టుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన సయీమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా(1) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ అజామ్ పాక్ ను ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..బాబర్ అజామ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 46 రన్స్ కు వెనుదిరిగాడు.
అయితే చివర్లో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫర్హాన్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. చివర్లో షాదాబ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో వాన్ షాల్క్ విక్ 4 వికెట్లు పడగొట్టాడు.
తర్వాత భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన యూఎస్ఏ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ఆడ్రియస్ గౌస్ , జహంగీర్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించారు. గౌస్ (13) పరుగులకే ఔటవగా… కెప్టెన్ మోనాంక్ పటేల్ (3) నిరాశపరిచాడు. అయితే జహంగీర్ 34 బంతుల్లో 49 ( 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. తర్వాత మిలింద్ , రంజానే దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగినట్టు కనిపించింది. 30 బంతుల్లోనే 51 ( 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవడంతో యూఎస్ఏ ఓటమి ఖాయమైంది.
చివరికి యూఎస్ఏ 20 ఓవర్లలో 158 పరుగులే చేయగలిగింది. వరుసగా రెండో విజయం సాధించిన పాక్ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరుకుంది.
