Just SpiritualLatest News
Diwali: లక్ష్మీ కటాక్షం కోసం.. దీపావళి రోజు దీపం వెలిగించాల్సిన 8 పవిత్ర స్థానాలు ఇవే!
Diwali: ఇంటి ప్రధాన ద్వారం వద్ద.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ఈ ముఖ్య ద్వారాన్ని పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి.

Diwali
లక్ష్మీదేవి – సంపద, వైభవం, ఆనందానికి మూలం. ఆమె అనుగ్రహం లభించిన ఇంట్లో దారిద్ర్యం చేరదు. పురాణాల ప్రకారం, దీపావళి(Diwali) రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుంది. అందుకే భక్తులు ఆమెకు స్వాగతం పలుకుతూ ఇంటిని శుభ్రం చేసి పూలతో, దీపాలతో అలంకరిస్తారు.
అమావాస్య చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశమానమవుతుంది. దీపావళి(Diwali)ని చీకటిపై కాంతి విజయంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివసించి, అష్టైశ్వర్యాలు కలగాలంటే, పూజ పూర్తయిన తర్వాత ఈ ఎనిమిది ముఖ్య ప్రదేశాలలో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం సూచిస్తుంది.
- ఇంటి ప్రధాన ద్వారం వద్ద.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ఈ ముఖ్య ద్వారాన్ని పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి.
- ధాన్యాగారంలో (Store House).. ఇది ఆహారాన్ని నిల్వ చేసే ప్రదేశం కాబట్టి, ఇక్కడ దీపం వెలిగిస్తే ఇంట్లో ఆహార సమృద్ధి ఎప్పుడూ ఉంటుంది.
- డబ్బు ఉంచే స్థలంలో.. సంపద స్థిరంగా, వృద్ధి చెందడానికి గుర్తుగా దీపావళి రాత్రి ఈ ప్రదేశంలో తప్పకుండా దీపాన్ని ఉంచాలి.

- వాహన సమీపంలో.. వాహనాలకు దీపం వెలిగించడం వల్ల ప్రమాదాలు దూరమై, వాటికి ,యజమానులకు భద్రత కలుగుతుంది.
- నీటి వనరుల వద్ద.. కుళాయిలు, లేదా ఇంటిలో నీటి వనరులు ఉన్న ప్రదేశం వద్ద దీపం వెలిగించడం వల్ల జలతత్త్వం పవిత్రమై, జీవన శక్తి పెరుగుతుంది.
- గుడి వద్ద లేదా పూజగదిలో.. ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించడం ద్వారా దేవతామూర్తుల కృప లభిస్తుంది , దివ్య శక్తి ఇంట్లో ప్రవహిస్తుంది.
- రావి చెట్టు వద్ద.. రావి చెట్టులో 33 వర్గాల దేవతలు నివసిస్తారని, ముఖ్యంగా విష్ణుమూర్తి స్వయంగా నివసిస్తారని నమ్మకం, కాబట్టి ఇక్కడ దీపం పెట్టడం అత్యంత శుభప్రదం.
- తులసి చెట్టు వద్ద.. తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి కోట వద్ద దీపం వెలిగించడం అత్యంత మంగళకరంగా పరిగణిస్తారు.