England win: ఎట్టకేలకు ఓ విజయం.. బాక్సింగ్ డే టెస్ట్ ఇంగ్లాండ్ దే

England win: బౌలర్లు చెలరేగిపోతున్నపిచ్ పై ఇంగ్లాండ్ (England win)ఈ స్కోరు ఛేదించడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే ఓపెనర్లు జాక్ క్రాలే , బెన్ డకెట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.

England win

యాషెస్ సిరీస్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్(England win) బోణీ కొట్టింది.. బౌలర్ల హవా కొనసాగిన వేళ 175 పరుగుల టార్గెట్ ను ఛేదించి ఆసీస్ జోరుకు బ్రేక్ వేసింది. అంతేకాదు 15 ఏళ్ల తర్వాత కంగారూల గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని రుచి చూసింది. నిజానికి తొలిరోజు ఇంగ్లాండ్ (England win)బ్యాటింగ్ చూసిన వారెవరైనా ఆ జట్టు గెలుస్తుందని కనీసం ఊహించలేదు. ఎందుకంటే అంత చెత్తగా ఆడింది ఇంగ్లీష్ టీమ్. తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోగా బౌలర్లు చెలరేగిపోయారు. కేవలం మొదటిరోజే 20 వికెట్లు పడ్డాయి. రెండోరోజు కూడా దాదాపు ఇదే పరిస్థితి.

ఓవరాల్ గా రెండురోజుల ఆటలో మొత్తం 36 వికెట్లు పడడం చూస్తే బౌలర్లు ఏ స్థాయిలో ఆధిపత్యం కనబరిచారో అర్థమవుతోంది. వికెట్ నష్టపోకుండా 4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 5 ఓవర్లు బాగానే ఆడింది. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ తప్పిస్తే ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో నిలవలేకపోయాడు.

అంచనాలు పెట్టుకున్న లబూషేన్ , ఖవాజా, కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. వీరిలో ముగ్గురు డకౌటయ్యారు. ట్రావిస్ హెడ్ , స్మిత్ పోరాడకుంటే కంగారూల స్కోరు 100 కూడా దాటేది కాదు. హెడ్ కాసేపు దూకుడుగా ఆడిన కీలక సమయంలో ఔటయ్యాడు.

Englandwin

బ్రైడెన్ కార్స్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 132 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులకు కులుపుకుని 175 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్(England win) ముందుంచింది.

బౌలర్లు చెలరేగిపోతున్నపిచ్ పై ఇంగ్లాండ్ (England win)ఈ స్కోరు ఛేదించడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే ఓపెనర్లు జాక్ క్రాలే , బెన్ డకెట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6.1 ఓవర్లలోనే 51 పరుగులు జోడించారు. వీరిద్దరూ వన్డే తరహా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు ఫస్ట్ గేర్ లో సాగింది. డకెట్ 34 పరుగులకు ఔటయ్యాడు.

బ్రైెడెన్ కార్స్ త్వరగానే ఔటైనా.. బెథెల్, క్రాలే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో హ్యారీ బ్రూక్ , జేమీ స్మిత్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో మ్యాచ్ ను సొంతం చేసుకుంది. అలాగే 5,468 రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ టెస్ట్ విజయాన్ని రుచి చూసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ లో ఆసీస్ ఆధిక్యాన్ని 1-3కు తగ్గించగలిగింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version