Asia Cup trophy: వివాదం ముగిసినట్టే? త్వరలోనే భారత్ కు ఆసియాకప్ ట్రోఫీ

Asia Cup trophy: చివరికి ఫైనల్లోనూ పాక్ పై గెలిచి దుమ్మురేపిన టీమిండియా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరారించింది.

Asia Cup trophy

ఆసియాకప్(Asia Cup trophy) గెలిచిన ఆనందం భారత్ జట్టుకు పూర్తిగా దక్కలేదు. దీనికి కారణం ట్రోఫీ(Asia Cup trophy) అందుకోలేకపోవడమే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏసీసీ చీఫ్ గానూ ఉన్న మోసిన్ నఖ్వీ వైఖరే ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈ వివాదం ఐసీసీ చెంతకు చేరింది. ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ట్రోఫీ పంచాయితీని వారి దృష్టికి తెచ్చింది. పీసీబీ చీఫ్ నఖ్వీ వైఖరిని ఐసీసీ ముందు ఎండగట్టింది. దీంతో జోక్యం చేసుకున్న ఐసీసీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.

ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు సన్నిహితుడిగా ఉన్న ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వంలో కమిటీని నియనించింది. త్వరలోనే ఈ కమిటీ ఇరు దేశాల బోర్డు పెద్దలతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించనుంది. ఆసియాకప్ మొదలైనప్పటి నుంచే భారత్ క్రికెటర్లు పాక్ ఆటగాళ్ళతో కరచాలనానికి నిరాకరిస్తూ వచ్చారు. దీనికి తోడు టోర్నీలో మూడుసార్లు పాక్ తో తలపడాల్సి వచ్చింది.

చివరికి ఫైనల్లోనూ పాక్ పై గెలిచి దుమ్మురేపిన టీమిండియా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరారించింది. పాక్ ప్రభుత్వంలో నఖ్వీ మంత్రిగా ఉండడమే దీనికి కారణం. పహల్గాం దాడులతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు టీమిండియా ఈ విధంగా బుద్ది చెప్పడంతో పీసీబీ చీఫ్ కు తీవ్ర అవమానం మిగిలింది.

Asia Cup trophy

ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా నఖ్వీ ట్రోఫీతో పాటు మెడల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏసీసీ ప్రధాన కార్యాలయంలో వాటిని ఉంచి తాళం వేయించాడు. తర్వాత పాకిస్తాన్ కు వెళ్ళిపోయిన నఖ్వీ తన అనుమతి లేకుండా ట్రోఫీని కదిలించవద్దంటూ ఆదేశాలు జారీ చేశాడు.

ఈ మొత్తం పరిణామాలపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ లా కాకుండా పాక్ వ్యక్తిలా వ్యవహరిస్తున్నాడంటూ మండిపడింది. ట్రోఫీని వెంటనే పంపించాలని కోరింది. కానీ నఖ్వీ మాత్రం తన చేతుల మీదుగానే అందిస్తానని, వచ్చి తీసుకోవాలని జవాబివ్వడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. తాజాగా ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తింది.

నఖ్వీ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యాడు. ముందు ఈ సమావేశానికి రాకుండా గైర్హాజరు అవుతాడని వార్తలు వచ్చినా.. చివరి నిమిషంలో హాజరైనట్టు తెలుస్తోంది. బీసీసీఐ ఈ వివాదం గురించి చెప్పిన తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇరు దేశాల క్రికెట్ బోర్డులను శాంతింపజేశాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రిక్వెస్ట్ చేసాయి. చివరికి ఐసీసీ జోక్యం కమిటీ ఏర్పాటుకు బీసీసీఐ, పీసీబీ ఆమోదం తెలపడంతో వివాదం దాదాపుగా ముగిసినట్టేనని భావిస్తున్నారు. త్వరలోనే ట్రోఫీ భారత్ కు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version