Super 8 : గ్రూప్ 2 మరింత డేంజర్…సెమీస్ కు చేరేది ఆ జట్లే

Super 8 :టీ20 ప్రపంచకప్ సూపర్ 8(Super 8) మ్యాచ్ ల ముంగిట సెమీఫైనల్ చేరే జట్లపై అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం గ్రూప్‌ 1 కంటే గ్రూప్ 2 ఇంకా ప్రమాదకరంగా ఉంది.

Super 8

టీ20 ప్రపంచకప్ సూపర్ 8(Super 8) మ్యాచ్ ల ముంగిట సెమీఫైనల్ చేరే జట్లపై అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం గ్రూప్‌ 1 కంటే గ్రూప్ 2 ఇంకా ప్రమాదకరంగా ఉంది. ఈ గ్రూప్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ , శ్రీలంక చోటు దక్కించుకున్నాయి. సూపర్ 8లో ఒక్కో జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుండగా.. టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి.

గ్రూప్ 1తో పోల్చి చూస్తే మాత్రం కాస్త డేంజర్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ మినహా మిగిలిన మూడు జట్లపై అంచనాలు పెట్టుకోవచ్చు. పాక్ పై ఎందుకు నమ్మకం పెట్టుకోకూడదంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు. ప్రస్తుత టోర్నీలోనూ అదే స్పష్టంగా కనిపించింది, భారత్ పై చేతులెత్తేసిన పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ లో నమీబియాపై మాత్రం రెచ్చిపోయింది. అయితే నిలకడలేని ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే పాక్ జట్టు సూపర్ 8(Super 8)లో ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.

మరోవైపు ఈ గ్రూప్ లో సెమీస్ చేరేందుకు ఎక్కువ అవకాశాలున్న జట్టు న్యూజిలాండ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కివీస్ నిలకడగా రాణిస్తూ టైటిల్ రేసులో దూసుకెళుతోంది. అన్నీ కుదిరితే న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం పెద్ద కష్టం కాదు. యువ , సీనియర్ ఆటగాళ్ళతో కలిసిన కివీస్ గ్రూప్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు విజయాలను అందుకుంది.సూపర్ 8లోనూ దుమ్మరేపేందుకు రెడీ అవుతోంది.

Super 8

పైకి సాధారణంగానే కనిపించినా కివీస్ మాత్రం ప్రమాదరమైన జట్టు అనడంలో ఎలాాంటి డౌట్ లేదు. వరల్డ్ కప్ కు ముందు భారత్ పై ఎలా ఆడిందో ఎవ్వరూ మరిచిపోలేరు. ఆల్ రౌండర్లే కివీస్ ప్రధాన బలం. ఇదిలా ఉంటే ఈ గ్రూప్ లో శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సొంతగడ్డపై దుమ్మురేపుతోన్న లంక ఇటీవలే ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే ఆసీస్ నిష్క్రమించడానికి ఆ జట్టే కారణం. ఈ నేపథ్యంలో సూపర్ 8లోనూ లంక సంచలనాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం లంకను అండర్ డాగ్ గా చెబుతున్నారు. ఇక ఇంగ్లాండ్ ను కూడా హాట్ ఫేవరెట్ గా చెబుతున్నా నిలకడలేమి మైనస్ గా మారింది. కానీ తనదైన రోజును అద్భుతంగా రాణించే సత్తా ఆ జట్టు సొంతం. దీంతో ఏ విధంగా చూసిన గ్రూప్ 2 కూడా టఫ్ గానే కనిపిస్తోంది. పాక్ జట్టు తప్పిస్తే మిగిలిన మూడు జట్లలో న్యూజిలాండ్, శ్రీలంక జట్లు సెమీస్ చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version