Virat Kohli: అడిలైడ్ లోనూ కోహ్లీ డకౌట్.. ఫ్యాన్స్ కు వీడ్కోలు సిగ్నల్

Virat Kohli: కోహ్లీ ఔట్ అయ్యి పెవిలియన్ కు వెళుతున్నప్పుడు స్టేడియంలోని అభిమానులందరూ లేచి నిలబడి అభివాదం చేయడం హైలెట్ నిలిచింది. ఇదిలా ఉంటే కోహ్లీ వరుసగా డకౌట్ కావడం తన కెరీర్ లోనే ఇది తొలిసారి. అలాగే

Virat Kohli

రీెంట్రీలో విరాట్ కోహ్లీ(Virat Kohli) వైఫల్యాల పరంపరం కొనసాగుతోంది. దాదాపు 8 నెలల తర్వాత బ్లూ జెర్సీతో గ్రౌండ్ లో అడుగుపెట్టిన రన్ మెషీన్ వరుసగా డకౌట్లవుతున్నాడు. పెర్త్ వన్డేలో ఖాతా తెరవని కింగ్.. ఇప్పుడు అడిలైడ్ లోనూ ఫ్లాప్ అయ్యాడు. వరుసగా రెండోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వికెట్ ఇచ్చుకున్నాడు. నాలుగు బంతులే ఆడిన విరాట్ ఇలా వరుసగా రెండోసారి ఖాతా తెరవకుండానే ఔటవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

అయితే కోహ్లీ ఔట్ అయ్యి పెవిలియన్ కు వెళుతున్నప్పుడు స్టేడియంలోని అభిమానులందరూ లేచి నిలబడి అభివాదం చేయడం హైలెట్ నిలిచింది. ఇదిలా ఉంటే కోహ్లీ వరుసగా డకౌట్ కావడం తన కెరీర్ లోనే ఇది తొలిసారి. అలాగే ఆసీస్ పై 13 ఏళ్ల తర్వాత తొలిసారి డకౌటయ్యాడు. కంగారూలతో ఆడిన 29 వన్డేల్లోనూ కోహ్లీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. ఇప్పుడు మాత్రం వరుసగా రెండు మ్యాచ్ లలో పేలవంగా ఔట్ అయ్యాడు.

Virat Kohli

ఇదిలా ఉంటే ఓవరాల్ గాకోహ్లీ(Virat Kohli)కి ఇది 40వ డకౌట్… టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ 552 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 40 సార్లు సున్నాకే వెనుదిరిగాడు. భారత్ నుంచి ఈ జాబితాలో జహీర్ ఖాన్ 44 సార్లు డకౌటై మొదటి ప్లేస్ లో నిలిస్తే..ఇషాంత్ శర్మ 40 డకౌట్ల రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్, బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే వన్డే కెరీర్ లో కోహ్లీకి ఇది 18వ డక్‌.

Virat Kohli

మరోవైపు పెవిలియన్ కు వెళుతూ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. రిటైర్మెంట్ వార్తలు వస్తున్న వేళ అడిలైడ్ లో ఆడడం ఇదే చివరిసారిగా భావించిన ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీనికి స్పందించిన కోహ్లీ తన చేతి గ్లౌజులను తీసి అభివాదం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోహ్లీ ఫ్యాన్స్ తెగ షైర్ చేస్తు కామెంట్లు చేస్తున్నారు.

కింగ్ ఎక్కడున్నా కింగే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక యాధృచ్ఛికమో మరొకటో తెలీదు కానీ సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే రోజున ఆసీస్ గడ్డపై కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ తో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ లో కోహ్లి 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇప్పుడు అదే రోజు డకౌటై అభిమానులను నిరాశపరిచాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version