T20: జోరు కొనసాగుతుందా ? రెండో టీ20కి భారత్ రెడీ

T20: ఇదిలా ఉంటే మూడో స్థానంలో వస్తున్న కెప్టెన్ నూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఫామ్ కోల్పోయాడు. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఒక్కడీ ఆడలేదు.

T20

సౌతాఫ్రికాతో ఐదు టీ ట్వంటీ(T20)ల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది. తొలి టీ20లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో అదరగొడితే, బౌలింగ్ లో అందరూ కలిసికట్టుగా రాణించారు. దీంతో 101 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ లో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేవు.

ఎందుకంటే తొలి టీ ట్వంటీ(T20)లో కాంబినేషన్ బాగానే కుదిరింది. అయితే అంచనాలు పెట్టుకున్న కీలక బ్యాటర్లు మాత్రం నిరాశపరిచారు. ఓపెనర్లలో గిల్ పేలవ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. నంజూ శాంసన్ ను కూర్బోబెట్టి ఆడిస్తుండగా.. అతను మంచి ఆరంభాలనివ్వడంలో విఫలమవుతున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో అదరగొడుతున్న గిల్ పార్ట్ ఫార్మాట్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు.

దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ఖచ్చితంగా ఈ సిరీస్ లో గాడిన పడాల్సిందే. అలాగే అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన టైమొచ్చింది. ఇదిలా ఉంటే మూడో స్థానంలో వస్తున్న కెప్టెన్ నూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఫామ్ కోల్పోయాడు. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఒక్కడీ ఆడలేదు.

T20

దీంతో ఈ మ్యాచ్ తో పాటు నూర్యకుమార్ ఫామ్ పైనే అందరి చూపు ఉంది. గత 15 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు టీ20 ప్రపంచకప్ కు ముందు ఇంకా 9 మ్యాచ్ లే మిగిలి ఉండడంతో నూర్య ఈ సిరీస్ లో తన బ్యాట్ కు పనిచెప్పాల్సిందే.

అలాగే తిలక్ వర్మ. అక్షర్ పటేల్, శివమ్ దూబే కూడా ధాటిగా ఆడితే తిరుగుండదు. తొలి టీ20(T20)లో చెలరేగి హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనూ రాణించాడు. అతనితో పాటు ఫినిషర్ రోజితేశ్ శర్మ మెరువులు మెరిపిస్తే భారీ స్కోరు ఖాయం. మరోవైపు తొలి టీ20లో ఘోరపరాజయం పాలైన సౌతాఫ్రికా సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బౌలర్లు రాణించినా, బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు.

దీంతో బ్యాటింగ్ గా డిన పడితే తప్ప సిరీస్ ను నమం చేసే అవకాశాలు కనిపించడం లేదు. సమిష్టిగా రాణిస్తేనే భారత్ జోరును అడ్డుకోగలమని సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్ రమ్ భావిస్తున్నాడు. ఇక ముల్లాన్పూర్ పిచ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా. ఆరంభంలో బ్యాటర్లు దూకుడు కనబరిచినా మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు అడ్వాంటేజ్ మారుతుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా హైస్కోరింగ్ మ్యాచ్ ను చూసే అవకాశాలున్నాయి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version