Phone: చనిపోయిన వ్యక్తి ఫింగర్‌తో ఫోన్ అన్‌లాక్ చేయొచ్చా?
Phone: ఫోన్ యూజ్ చేస్తున్న వ్యక్తి చనిపోతే, అతని వేలిముద్రతో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
Phone
పెరుగుతున్న టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులతో కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నాయి. వీటిలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఒకటి. ఈ ఫీచర్ ఒక వ్యక్తి వేలిముద్రతో ఫోన్‌ను లాక్ చేయడానికి ,అన్‌లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది, దీని ద్వారా మన ఫోన్‌ను ఇతరులు ఓపెన్ చేయకుండా కాపాడుతుంది. అయితే, ఫోన్(Phone) యూజ్ చేస్తున్న వ్యక్తి చనిపోతే, అతని వేలిముద్రతో ఈ ఫోన్‌ను అన్‌లాక్ చేయొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది?..ఈ సెన్సార్లు బయోమెట్రిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, ప్రతి వ్యక్తి వేలిముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. మన వేలిముద్రను సెన్సార్‌పై పెట్టినప్పుడు, అది మన వేలిముద్ర ఆకారపు డిజిటల్ చిత్రాన్ని క్రియేట్ చేసి, దానిని ఫోన్‌లోని డేటాబేస్‌తో సరిపోల్చుతుంది. అప్పుడు ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఈ ప్రక్రియ మిల్లీసెకన్లలో జరుగుతుంది.
స్మార్ట్‌ఫోన్(Phone)లు ప్రధానంగా మూడు రకాల వేలిముద్ర సెన్సార్‌లను ఉపయోగిస్తాయి. ఆప్టికల్, కెపాసిటివ్ , అల్ట్రాసోనిక్. వీటిలో ఆప్టికల్ , కెపాసిటివ్ సెన్సార్లు సాధారణంగా చౌకైనవి , ఎక్కువ ఫోన్లలో కనిపిస్తాయి. అయితే, అల్ట్రాసోనిక్ సెన్సార్లు చర్మం లోపలి 3D చిత్రాలను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తాయి. ఇవి చెమట, ధూళి, తేమ , రక్త నాళాలు వంటి లక్షణాలను కూడా గుర్తించగలవు.

మరణానంతరం ఫోన్ అన్‌లాక్ సాధ్యమేనా? చనిపోయిన వ్యక్తి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్ చేయడం చాలా కష్టం లేదా అసాధ్యం. దీనికి గల కారణాలు
విద్యుత్ ఛార్జ్ కోల్పోవడం.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను సక్రియం చేయడానికి అవసరమైన వేలి చర్మంలోని కణజాలం (Tissue) మరణించిన తర్వాత దాని విద్యుత్ ఛార్జ్‌ను కోల్పోతుంది. ముఖ్యంగా కెపాసిటివ్ సెన్సార్లు పనిచేయడానికి వేలి వేడితో పాటు విద్యుత్ ఛార్జ్ అవసరం.
చర్మం మార్పులు.. మరణించిన తర్వాత చర్మం ఎండిపోయి, కుచించుకుపోతుంది. ఇది వేలిముద్ర యొక్క ఆకారాన్ని మారుస్తుంది, దీనిని సెన్సార్ గుర్తించడం కష్టం అవుతుంది.
అయితే, కొన్ని నివేదికల ప్రకారం, వ్యక్తి మరణించిన 12 నుంచి 24 గంటలలోపు (చర్మం పూర్తిగా ఎండిపోకముందు) ఫోన్ అన్‌లాక్ చేసే ప్రయత్నాలు చేస్తే, ముఖ్యంగా అధునాతన అల్ట్రాసోనిక్ సెన్సార్లలో, విజయవంతం అయ్యే అవకాశం కొద్దిగా ఉంది. కానీ ఆ తర్వాత సెన్సార్ల పనితీరు ఆగిపోతుంది. అందుకే, చనిపోయిన వ్యక్తి వేలితో ఫోన్ అన్‌లాక్ చేయడం సురక్షితమైన, సులభమైన పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు.



