Iphone: ఐ ఫోన్ యూజర్లకు బిగ్ షాక్ హ్యాకింగ్ వార్నింగ్ ఇచ్చిన CERT

Iphone: పాత ఓఎస్ వెర్ష‌న్లు ఉప‌యోగిస్తున్న‌ వారంతా ఖఛ్చితంగా అప్డేట్ చేసుకోవాల‌ని స్పష్టం చేసింది. ఐఫోన్లు మాత్రమే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లను లేటెస్ట్ వెర్షన్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది.

Iphone

ప్రపంచవ్యాప్తంగా ఐ ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే… కొత్త మోడల్ వస్తుందంటే చాలు ఎగబడుతుంటారు.. ఎందుకంటే ఫీచర్స్ లో ఐఫోన్ మించింది లేదు కాబట్టి…పైగా సెక్యూరిటీ పరంగానూ ఐఫోన్ ను బెస్ట్ గా చెబుతుంటారు. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈజీగా హ్యాకింగ్ కు గురవుతాయాని చాలా మంది ఐఫోన్లు కొంటుంటారు. అయితే ఇప్పుడు ఐఫోన్ల(Iphone) పరిస్థితి కూడా డేంజర్ లో పడినట్టు వార్తలు వస్తున్నాయి.

ఐఫోన్లు(Iphone) హ్యాకింగ్ బారిన పడబోతున్నట్టు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఈఆర్టీ) కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఈఆర్టీ) పరిశోధన ప్రకారం యాపిల్ ఉత్పత్తుల్లో ఒక భద్రతా లోపాన్ని గుర్తించారు. ఈ బగ్ ఇష్యూ కారణంగా హ్యాకర్లు ఐఫోన్ల నుండి మాత్రమే కాకుండా మ్యాక్ బుక్, ఐపాడ్లు నుండి సైతం సమాచారాన్ని చోరీ చేసేందుకు వీలుందని తెలుస్తోంది.

Iphone

కేంద్ర ప్రభుత్వానికి సిఈఆర్టీ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం 18.7.1కి ముందు, 26.0.1కి ముందు యాపిల్ ఐవోఎస్, ఐపాడ్ వోఎస్ వెర్షన్లు, యాపిల్ మ్యాక్ వోఎస్ వెర్షన్లు, 15.7.1కి ముందు యాపిల్ మాకోస్ సీక్వోయా వెర్షన్లు, 26.0.1కి ముందు యాపిల్ విజిన్ వోఎస్ వెర్షన్లు, 14.8.1కి ముందు యాపిల్ మాకోస్ సోనోమా వెర్షన్లలో ఈ బగ్ ఇష్యూతో హ్యాకింగ్ సమస్యలు వస్తాయని తెలుస్తోంది.

వీటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా రన్ అవుతున్న యాపిల్ ఫోన్లలో సదరు యూజర్ ను లేదా కంపెనీని టార్గెట్ చేసే ప్రమాదముంటుంది. ఒకవేళ హ్యాకింగ్ కు గురైతే డేటాను చోరీ చేయడం , యాప్స్ క్రాష్ అవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ సిగ్న‌ల్ అంద‌క‌పోవ‌డం, ఫోన్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటివి కూడా కనిపిస్తుంటాయని సిఈఆర్టీ వార్నింగ్ ఇచ్చింది. హ్యాకింగ్ ముప్పుకు గురవకుండా ఉండాలంటే వెంటనే యాపిల్ యూజర్లు తమ ఫోన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

Iphone

పాత ఓఎస్ వెర్ష‌న్లు ఉప‌యోగిస్తున్న‌ వారంతా ఖఛ్చితంగా అప్డేట్ చేసుకోవాల‌ని స్పష్టం చేసింది. ఐఫోన్లు(Iphone) మాత్రమే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లను లేటెస్ట్ వెర్షన్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. వీటితో పాటు రెగ్యులర్ గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని కోరింది. ప్రస్తుతం ఐఫోన్లలో యూజర్లు ఇన్ స్టాల్ చేసుకున్న యాప్స్ ను ఒకసారి పరిశీలించుకోవాలి. తెలియని యాప్ లు ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఫోన్ పాస్ట్ వర్డ్స్ , బయోమెట్రిక్ లాక్ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలి.

Exit mobile version