Re-commerce:రీ-కామర్స్ గురించి ఐడియా ఉందా?

Re-commerce: స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్రాండెడ్ బట్టలు , ఖరీదైన ఫర్నిచర్ రంగాల్లో ఈ బిజినెస్ మోడల్ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది.

Re-commerce

వ్యాపార ప్రపంచంలో ఇప్పుడు ‘రీ-కామర్స్’ (Re-commerce) లేదా ‘రివర్స్ కామర్స్’ అనే మాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఇంతకీ రీ-కామర్స్ అంటే ఏంటంటే.. పాత వస్తువులను కొనుగోలు చేసి, వాటిని బాగు చేసి (Refurbish) మళ్లీ కొత్తవారికి విక్రయించడం. ఒకప్పుడు పాత వస్తువులు అంటే కేవలం పేదవారు మాత్రమే వాడతారని అనుకునేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్రాండెడ్ బట్టలు , ఖరీదైన ఫర్నిచర్ రంగాల్లో ఈ బిజినెస్ మోడల్ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. ఓఎల్ఎక్స్ (OLX), క్యాషిఫై (Cashify), అమెజాన్ రెన్యూడ్ వంటి వేదికలు దీనికి ఉదాహరణలు. పర్యావరణ స్పృహ పెరగడం , తక్కువ ధరలో మంచి బ్రాండ్లు కావాలనే కోరిక వినియోగదారులను ఈ వైపు మళ్లిస్తోంది.

రీ-కామర్స్ (Re-commerce) సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్.. వాల్యూ ఫర్ మనీ. ఉదాహరణకు ఒక కొత్త ఐఫోన్ లక్ష రూపాయలు ఉంటే, అదే ఫోన్ ఏడాది పాటు వాడిందయితే రీ-కామర్స్ మార్కెట్లో 50 నుంచి 60 వేలకే దొరుకుతుంది. అది కూడా వారంటీతో దొరుకుతుండటంతో మధ్యతరగతి ప్రజలు వీటిని కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Re-commerce

వ్యాపారస్తులకు కూడా దీనిలో మంచి లాభాలుంటాయి. తక్కువ ధరకు పాత వస్తువులను సేకరించి, వాటికి చిన్న చిన్న రిపేర్లు చేసి అమ్మడం వల్ల మార్జిన్ ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల తయారీ రంగంలో కొత్త వస్తువుల ఉత్పత్తి భారం తగ్గి, పర్యావరణానికి వ్యర్థాల సమస్య తగ్గుతుంది. దీనినే ‘సర్క్యులర్ ఎకానమీ’ అని పిలుస్తారు, అంటే ఒక వస్తువును ఎక్కువ కాలం వినియోగంలో ఉంచడం అన్నమాట

భవిష్యత్తులో ఈ రీ-కామర్స్(Re-commerce) రంగం మరింతగా డెవలప్ చెందబోతోంది. 2026 నాటికి భారతదేశంలో సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఒక అంచనా. కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్ లైన్ స్టోర్లు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఒక ప్రత్యేక కేటగిరీ ఎంచుకుని, పాత వస్తువులను సేకరించి ఆన్‌లైన్ లో అమ్ముతూ మంచి ఆదాయం సంపాదించొచ్చు.

అయితే, దీనిలో నమ్మకమనేది చాలా ముఖ్యం. వస్తువు నాణ్యత విషయంలో కొనుగోలుదారులకు నమ్మకం కలిగించగలిగితే ఇక రీ-కామర్స్ (Re-commerce) లో తిరుగుండదు. పాతదే కొత్త బంగారమన్నట్లుగా, ఈ రీ-కామర్స్ బిజినెస్ ఇప్పుడు సరికొత్త ఆర్థిక విప్లవానికి తెరలేపుతోంది.

Megastar Chiranjeevi:బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి మ్యాజిక్..ఆరు రోజుల్లోనే మన శంకరవరప్రసాద్ గారు రికార్డ్

Exit mobile version