Sakhi Centres
భారతదేశంలో మహిళా రక్షణ ,సేఫ్టీ అనేది ఎప్పుడూ ప్రాధాన్యత కలిగిన అంశం. సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులు, వేధింపులు , దాడుల నుంచి వారిని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘సఖీ – వన్ స్టాప్ సెంటర్స్’ (Sakhi – One Stop Centres) అనే రెవల్యూషనరీ స్కీమును ప్రవేశపెట్టింది.
గృహ హింస, లైంగిక వేధింపులు, ఆసిడ్ దాడులు లేదా మరే ఇతర కష్టాల్లో ఉన్న మహిళలకు ఒకే ప్రాంగణంలో సమగ్రమైన సేవలు అందించడమే ఈ సఖీ కేంద్రాల (Sakhi Centres) ప్రధాన ఉద్దేశ్యం. ఒక మహిళకు ఆపద కలిగినప్పుడు ఆమె పోలీసు స్టేషన్, ఆసుపత్రి , కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఈ సఖీ కేంద్రానికి వస్తే చాలు.. అక్కడ ఆమెకు కావలసిన అన్ని రకాల సాయం కూడా అందుతుంది. ఇది నిజంగా మహిళలకు ఒక రక్షణ కవచం వంటిది.
సఖీ కేంద్రాలలో (Sakhi Centres)లభించే సేవలలో మొదటిది మెడికల్ ఎయిడ్ – అంటే శారీరక దాడికి గురైన మహిళలకు వెంటనే చికిత్స అందించడం.రెండోది ‘లీగల్ అసిస్టెన్స్’ – బాధితులకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం , అవసరమైతే కేసు దాఖలు చేయడంలో సహాయం చేయడం.మూడోది ‘సైకలాజికల్ కౌన్సెలింగ్’ – మానసిక వేదనలో ఉన్న మహిళలకు ధైర్యం చెప్పి వారిని సాధారణ స్థితికి తీసుకురావడం.
అంతేకాకుండా, తక్షణ రక్షణ కావాల్సిన వారికి ఈ కేంద్రాలలో ఐదు రోజుల పాటు టెంపరరీ షెల్టర్ కల్పిస్తారు. అక్కడ వారికి భోజన సదుపాయం కూడా ఉంటుంది. 24 గంటల పాటు పనిచేసే ఈ కేంద్రాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. దీని ద్వారా బాధితులు తమ స్టేట్‌మెంట్‌ను నేరుగా మెజిస్ట్రేట్‌కు కూడా రికార్డ్ చేయొచ్చు.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ సఖీ కేంద్రాలు (Sakhi Centres)అందుబాటులోకి వచ్చాయి. మన చుట్టూ ఉన్న మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ కేంద్రాల గురించి అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. ఎవరికైనా ఆపద కలిగితే వెంటనే 181 ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కానీ, లేదా జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా సాయం పొందొచ్చు.
మహిళలు తమ కష్టాలను చెప్పుకోవడానికి వెనుకాడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేలా ఈ సఖీ కేంద్రాలు భరోసా ఇస్తున్నాయి. మహిళా సాధికారతకు , భద్రతకు సఖీ సెంటర్లు ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
IND vs NZ: ఇండోర్‌లో టీమిండియా ఫ్లాప్ షో..న్యూజిలాండ్ దే వన్డే సిరీస్
