Local identity: రెండేళ్లు బయట చదివితే స్థానికత పోతుందా?

Local identity: తెలంగాణ విద్యార్థుల స్థానికత భవిష్యత్తు… సుప్రీంకోర్టు తీర్పు కోసం రాష్ట్రం ఉత్కంఠ

Local identity

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్హతల కోటాలకు సంబంధించి స్థానికత సమస్య.. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో దూకుడు చూపిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా స్థానికతపై తీసుకొచ్చిన పరిమితులపై సుప్రీం బెన్చ్ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించి ఉండినా, రెండేళ్లు రాష్ట్రానికి వెలుపల చదివితే, అతనికి/ఆమెకి స్థానికత హక్కు తొలగిపోతుంది. దీనిపై ధర్మాసనం తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. విద్యార్థి దుబాయ్‌కు వెళ్లి చదవడం వల్ల వారి స్థానిక హక్కు ఎలా పోతుంది? నిబంధనలు పెట్టడమే కాదు… వాటి ఆచరణపై కూడా సమర్థత ఉండాలని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ధర్మాసనం 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు తీసుకొచ్చిన స్థానికత నిబంధనల(Local identity)పై ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో మీరు రెండు, నాలుగేళ్ల గడువు గురించి ఎక్కడ పేర్కొన్నారు? తర్వాత నియమాలు మార్చారా? వాటికి రాజ్యాంగానుగుణత ఉన్నదా? అని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారాన్ని పేద, మధ్యతరగతి విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చూడాలని, కోర్టును కోరారు. నియమాలు స్థానిక అభ్యర్థుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఉద్దేశంతో తీసుకురాలేదని, అవి రాష్ట్ర స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని వాదించారు.

Local identity

అయితే ధర్మాసనం ఈ వాదనలపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే ఈ తరహా నిబంధనలు (Local identity)మరింత సమర్థత, న్యాయనిర్ణయం అవసరమని సూచించింది. స్థానికత అనే అంశం విద్యార్థుల హక్కులకు అన్యాయం చేసేలా వక్రీకరించబడకూడదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఇక ముందు చూపుతో విద్యార్థులు, తల్లిదండ్రులు చదువు కోసం ఇతర దేశాలకు వెళ్తే, వారి స్థానికతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రాష్ట్రాలు తమంతట తామే నిబంధనలు మార్చేసుకుంటే ఏమవుతుంది? వంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఇప్పుడు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి.ఇది విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కచ్చితంగా అయోమయంలోకి నెట్టేస్తుంది.

ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా వస్తే, రాష్ట్రం వెలుపల రెండు సంవత్సరాలు చదివిన విద్యార్థులు స్థానికత హక్కు కోల్పోతారు. ఫలితంగా వారు తెలంగాణలోని మెడికల్, ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక కోటాలో సీట్లు పొందలేరు. ఇది విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ విద్య కోసం వెళ్లే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చదువుకోసం వెళ్లిన విద్యార్థులపై శిక్షలా ఈ నిబంధనలు మారతాయి. అటువంటి ప్రతికూలతలపై ప్రభుత్వం ముందే ఆలోచించకపోవడం అనేక సందేహాలకు తావిస్తుంది. ఈ కేసులో సుప్రీం తీర్పు ఏ మేరకు వస్తుందో చూడాలి.

Also Read: Rajinikanth :రజనీ కాంత్ లైఫ్‌లోనూ ఓ అమ్మాయి ఉంది.. తను ఎవరో కాదు..

 

Exit mobile version